Burger | ఈ బ‌ర్గ‌ర్ ఖ‌రీదు రూ.17,785.. ఎందుకింత స్పెష‌ల్‌

కాలిఫోర్నియా (California)లోని లెవీస్ స్టేడియం (Levis Stadium)లో విక్రయించిన ఒక బర్గర్ (Burger) ధర అక్షరాలా 180 డాల‌ర్లుగా ఉంది. అంటే మ‌న భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 16,298 అన్న‌మాట‌.ప్ర‌స్తుతం ఈ బ‌ర్గ‌ర్ ధ‌ర చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ బ‌ర్గ‌ర్‌కు ఇంత ఖ‌రీదు పెట్ట‌డం అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Burger | ఈ బ‌ర్గ‌ర్ ఖ‌రీదు రూ.17,785.. ఎందుకింత స్పెష‌ల్‌

Burger | బ‌ర్గర్ (burger) ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. రెండు బ‌న్నుల మ‌ధ్య‌లో టిక్కీ (వెజ్ ఆర్ నాన్ వెజ్‌), కూర‌గాయ ముక్క‌లు, ఛీజ్ వంటివిపెట్టి త‌యారు చేసే ఈ బ‌ర్గ‌ర్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, సాధార‌ణంగా ఓ బ‌ర్గ‌ర్ ఖ‌రీదు ఎంతుంటుంది. మ‌హా అయితే రూ.60. లేదంటూ రూ.120 వ‌ర‌కూ ఉండొచ్చు. కానీ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ బ‌ర్గ‌ర్ ఖ‌రీదు చూసి నెటిజ‌న్లు నోరెళ్ల బెడుతున్నారు. ఎందుకంటే దాని ఖ‌రీదు రూ.10వేల‌కుపైనే ఉంది మ‌రి.

కాలిఫోర్నియా (California)లోని లెవీస్ స్టేడియం (Levis Stadium)లో విక్రయించిన ఒక బర్గర్ ధర అక్షరాలా 180 డాల‌ర్లుగా ఉంది. అంటే మ‌న భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 16,298 అన్న‌మాట‌. లెవీస్ స్టేడియంలో హాస్పిటాలిటీ పార్ట్‌న‌ర్ లెవీ ఈ ఖ‌రీదైన బ‌ర్గ‌ర్‌ను రూపొందించింది. 3.5 పౌండ్ల బరువు ఉండే ఈ బర్గర్‌ను నలుగురు వ్యక్తులు ఈజీగా తినేయొచ్చు.

నెటిజ‌న్లు షాక్‌..
NFL మేనేజింగ్ ఎడిటర్ జిమ్మీ డర్కిన్ (NFL Managing Editor Jimmy Durkin) ఈ బర్గర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మ‌రో షాకింగ్ విష‌యం ఏంటంటే..? ఈ బ‌ర్గ‌ర్ అస‌లు ధ‌ర 180 డాల‌ర్లే అయిన‌ప్ప‌టికీ ట్యాక్స్‌లు అన్నీ క‌లిపి 196.43 డాల‌ర్లు ప‌డిందంట‌. అంటే రూ.17,785 అన్నమాట‌. ప్ర‌స్తుతం ఈ బ‌ర్గ‌ర్ ధ‌ర చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ బ‌ర్గ‌ర్‌కు ఇంత ఖ‌రీదు పెట్ట‌డం అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎందుకింత స్పెష‌ల్‌..
దీన్ని బీఫ్‌తో ప్ర‌త్యేకంగా త‌యారు చేశార‌ట‌. ఇందులో గ్రౌండ్ బీఫ్ ప్యాటీ (ground beef patty)కి బ‌దులుగా, ఎముక‌తో స‌హా ఉడికించిన మొత్త‌టి బీఫ్ షాంక్ (beef shank)వాడారు. దీనిపై రోస్టెడ్ మిరెపోయి డెమి-గ్లేస్ సాస్, పాయింట్ రేయ్స్ బ్లూ చీజ్ ఫాండ్యూ (Bleu Cheese Fondue) వేశారు. వీటి మ‌ధ్య‌లో స్పెష‌ల్ బ‌న్స్‌ను ఉంచారు. ప్ర‌స్తుతం ఈ బ‌ర్గ‌ర్‌పై నెటిజ‌న్లు తెగ చ‌ర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Theatre Movies | వాలెంటైన్స్ వీక్‌లో థియేటర్ల సందడి… కొత్త సినిమాలు, రీ రిలీజ్‌ల జోష్!
Mumbai Local Train | బుర‌ఖా ధ‌రించి లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిన యువ‌కుడు.. త‌ర్వాత ఏమైందంటే..?