Boat Accident| బోట్ ను ముంచెత్తిన రాకాసి అలలు.. ఆరుగురు సేఫ్: వీడియో వైరల్

సరదగా సముద్ర అలలపై విహరించాలనుకున్న ఓ ఆరుగురు సభ్యుల కుటుంబాన్ని అనూహ్యంగా విరుచుకుపడిన రాకాసి అలలు బోట్ ను ముంచెత్తిన ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రమాదంలో అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా ప్రాణాలలో బయటపడ్డారు.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Feb 15, 2026, 12:13 pm IST
Read Time: 3 mins
Boat Accident| బోట్ ను ముంచెత్తిన రాకాసి అలలు.. ఆరుగురు సేఫ్: వీడియో వైరల్

విధాత : సరదగా సముద్ర అలలపై విహరించాలనుకున్న ఓ ఆరుగురు సభ్యుల కుటుంబాన్ని అనూహ్యంగా విరుచుకుపడిన రాకాసి అలలు బోట్ ను ముంచెత్తిన ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రమాదంలో అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా ప్రాణాలలో బయటపడ్డారు.

కాలిఫోర్నియాలో సముద్ర తీరంలో బోట్ లో విహరిస్తున్న ఆరుగురు కుటుంబ సభ్యులపై స్టీమర్ లేన్ వద్ద 10-15 అడుగుల రాకాసి అలలు అకస్మాత్తుగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అలల ధాటి నుంచి తప్పించుకునేందుకు బోట్ వేగం పెంచినప్పటికి అంతకంటే వేగంగా అలలు వారిని ముంచెత్తాయి. దీంతో బోట్ లోని ఇద్దరు తల్లిదండ్రులు, వారి నలుగురు పిల్లలు నీటిలో పడిపోయి లైఫ్ జాకెట్ ల పుణ్యమా అని తేలుతూ సముద్ర అలల నుంచి ప్రాణాపాయం మధ్య మునుగుతు తేలుతున్నారు.

ఈ ప్రమాదాన్ని సమీపంలో ఉన్న సర్ఫర్ల బృందం గమనించింది. ధైర్యం చేసి సంఘటన స్థలానికి చేరుకుని నీళ్లలో మునిగి తేలుతున్న కుటుంబ సభ్యులను, పిల్లలను కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. విండ్ సర్పర్లు సకాలంలో స్పందించి ధైర్యంగా వారిని రక్షించేందుకు ముందుకురాకపోతే వారంతా సముద్రం ఉదృతిలో గల్లంతయ్యి ప్రాణాలు కోల్పోయేవారు. సాహసంతో వారిని కాపాడిన శాంటా క్రజ్ సర్ఫర్లు డారిల్ విరోస్ట్కో, 14 ఏళ్ల ఇయాన్ ఆండర్సన్ లపై అంతా అభినందనలు కురిపించారు.