Theatre Movies | వాలెంటైన్స్ వీక్‌లో థియేటర్ల సందడి… కొత్త సినిమాలు, రీ రిలీజ్‌ల జోష్!

Theatre Movies | ప్రేమికుల రోజు సందర్భంగా ఈ వారం థియేటర్లలో సినిమాల హడావిడి కనిపించబోతోంది. చిన్నా–పెద్దా కలిపి పలుచిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుండగా, కొన్ని సూపర్ హిట్ లవ్ స్టోరీలు రీ–రిలీజ్‌లుగా కూడా సందడి చేయనున్నాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్, సంతోష్ శోభన్ చిత్రాలతో పాటు నాగచైతన్య హిట్ మూవీ రీ–రిలీజ్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

  • By: sn |    movies |    Published on : Feb 09, 2026 2:30 PM IST
Theatre Movies | వాలెంటైన్స్ వీక్‌లో థియేటర్ల సందడి… కొత్త సినిమాలు, రీ రిలీజ్‌ల జోష్!

Theatre Movies | ప్రేమికుల రోజు సందర్భంగా ఈ వారం థియేటర్లలో సినిమాల హడావిడి కనిపించబోతోంది. చిన్నా–పెద్దా కలిపి పలుచిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుండగా, కొన్ని సూపర్ హిట్ లవ్ స్టోరీలు రీ–రిలీజ్‌లుగా కూడా సందడి చేయనున్నాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్, సంతోష్ శోభన్ చిత్రాలతో పాటు నాగచైతన్య హిట్ మూవీ రీ–రిలీజ్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముందుగా విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్–కామెడీ ఎంటర్‌టైనర్‌పై మంచి బజ్ ఉంది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌తోనే నవ్వుల విందు ఇవ్వబోతుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

అదే రోజు విడుదల కానున్న మరో చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ క్రైమ్–హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందింది. ట్రైలర్‌తోనే ఉత్కంఠ రేపిన ఈ చిత్రం థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. చిన్న సినిమాల జాబితాలో ‘స్కై’ అనే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను టార్గెట్ చేస్తోంది. అలాగే బాక్సింగ్ నేపథ్యంతో రూపొందిన మరో చిన్న చిత్రం కూడా అదే రోజున విడుదల కానుంది.

వాలెంటైన్స్ డే రోజున ప్రత్యేకంగా విడుదలవుతున్న చిత్రాల్లో సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రధాన ఆకర్షణ. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం యువతకు పండగ వాతావరణాన్ని తీసుకురానుందనే టాక్ వినిపిస్తోంది. మానస వారణాసి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ మ్యూజికల్ రొమాన్స్‌గా రూపొందింది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ యాక్షన్–లవ్–ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తోంది. ఇందులో అర్జున్‌తో పాటు ఐశ్వర్య అర్జున్, నిరంజన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇవే కాకుండా రీ–రిలీజ్‌ల హంగామా కూడా ఉంది. నాగచైతన్య–సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఉదయ్ కిరణ్ కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘మనసంతా నువ్వే’ కూడా రీ–రిలీజ్ అవుతోంది. ఈ రెండు లవ్ స్టోరీలు ప్రేమికులకు ప్రత్యేక ట్రీట్‌గా నిలవనున్నాయి. త్తంగా ఈ వాలెంటైన్స్ వీక్‌లో కొత్త సినిమాలు, పాత ప్రేమకథల రీ–రిలీజ్‌లతో థియేటర్లు సందడిగా మారనున్నాయి. ప్రేమికుల రోజున సినీ ప్రేక్షకులకు వినోదం కొరత ఉండదనడం ఖాయం.