Akhanda 2 : అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట
అఖండ 2 సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ల ధరల పెంపునకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
విధాత, హైదరాబాద్ : అఖండ 2 సినిమా నిర్మాతలకు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. అఖండ 2 సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14 వరకూ డివిజన్ బెంచ్ స్టే ఇస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ అందరి వాదనలు వినకుండా తీర్పు ఇచ్చిందని..ఈ కేసు మళ్లీ సింగిల్ బెంచ్ లోనే విచారణ జరుగాలని డివిజన్ బెంచ్ పేర్కొంది. డివిజన్ బెంచ్ ఆదేశాలతో ప్రభుత్వ జీవో మేరకు 14వ తేదీ వరకు అఖండ 2 సినిమా టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు నిర్మాతలకు దక్కినట్లయ్యింది.
అంతకుముందు అఖండ 2 సినిమా టికెట్ల ధరల జీవోను సస్పెండ్ చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా పెంచిన ధరలకే టికెట్లను విక్రయించడంపై నిర్మాతలపైన, బుక్ మై షోపైన సింగిల్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీపై కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయరాదంటూ ప్రశ్నించింది. కేసు విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. అంతలోనే సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై 14రీల్స్ సంస్థ నిర్మాతలు డివిజక్ బెంచ్ ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఈ కేసు పూర్తిగా మరోసారి సింగిల్ బెంచ్ ముందుకే రావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
akhanda-2 | ఆఖండ 2 సినిమా నిర్మాతలపై హైకోర్టు ఆగ్రహం
Pawan Kalyan| ఢిల్లీ హైకోర్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram