Vijay Devarakonda|విజయ్ దేవరకొండ అరాచకం.. క్రేజీ అప్‌డేట్‌కి పిచ్చెక్కిపోవల్సిందే..!
Vijay Devarakonda| రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకి దేశ
Vijay Devarakonda| రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకి దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ పలు ప్రయోగాలు చేస్తూ సినిమాలు చేస్తుండగా,అవి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. చివరిగా భారీఅంచనాల నడుమ వచ్చిన లైగర్ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఇక ప్రస్తుతం తన 12వ సినిమాగా ఓ సినిమా చస్తున్నాడు. ఇందులో విజయ్ (Vijay Devarakonda) స్పై పాత్రలో కనిపించనున్నారు. మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండను (Vijay Devarakonda) పవర్‌ఫుల్‌గా చూడనున్నారని నిర్మాత ఓ సందర్భంలో అన్నారు. వచ్చే ఏడాది మార్చి28న ఈ సినిమా విడుదల కానుంది

సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.మళ్ళీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరి (gowtham tinnanuri) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా మూవీ రూపొందుతుంది. వీడీ 12’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 60 శాతం షూటింగ్ పూర్తి కాగా, మిగతా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి మార్చి 28న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. విజయ్ ఓ స్పై పాత్రలో కనిపించనున్నారు. మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూడనున్నారని నిర్మాత ఓ సందర్భంలో అన్నారు.
ప్రస్తుతం కేరళలో విజయ్ ఫ్యాన్స్ మీట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టంట్ డైరక్టర్ ఛేతన్ రష్మి డిసౌజా మాట్లాడుతూ…ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కేరళలో షూట్ చేసామని చెప్పారు. ఆ ఫైట్ సీక్వెన్స్ బ్రిలియెంట్ గా వచ్చిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి సినిమాపై అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో అయిన విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram