Wedding In ICU : ఐసీయూలో యువతికి తాళి కట్టిన యువకుడు

పెళ్లి ముహూర్తం మిస్సవకూడదన్న భావనతో కేరళలో ఓ యువకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్న వధువు అవనికి ఆస్పత్రిలోనే తాళి కట్టి పెళ్లి చేసుకున్న సంఘటన వైరల్‌గా మారింది.

Wedding In ICU : ఐసీయూలో యువతికి తాళి కట్టిన యువకుడు

విధాత : పెళ్లిళ్లు పలు రకాలు అన్నట్లుగా ఆపద్కాలం పెళ్లి ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. తనతో పెళ్లి నిశ్చయమైన యువతి అనుకోని ప్రమాదానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతుండగానే.. ఓ యువకుడు తాళి కట్టిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన వివరాలలోకి వెళితే.. కేరళలోని తంబోలికి చెందిన వీఎం శరణ్, అలప్పుకి చెందిన అవనికి శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కార్యక్రమానికి వధువును అలంకరణ కోసం తీసుకెళ్తుండగా..ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అవని వెన్నెముక భాగంలో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను కొట్టాయంలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం ప్రత్యేక వైద్యం కోసం అక్కడి నుంచి కొచ్చిలోని మరో ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరుగాలన్న ఆలోచనతో పెద్దల సూచన మేరకు ఐసీయూల చికిత్స పొందుతున్న అవనికి వరుడు శరణ్ ఆస్పత్రిలోనే తాళి కట్టి వివాహం చేసుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన శరణ్, వైద్యుల అనుమతితో అవనికి ముందు అనుకున్న ముహూర్తానికి తాళి కట్టి పెళ్లి తంతు పూర్తి చేయడం విశేషం.