ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మరో రెండు రోజుల్లో నిషేధిత

విధాత,న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మరో రెండు రోజుల్లో నిషేధిత జాబితాలోకి వెళ్లనున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధలపై ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు మే 26తో ముగుస్తుండడంతో ఇక ఇండియాలో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ కార్యకలాపాల్ని కొనసాగించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 26న ఈ నిబంధనల విడుదల సమయంలో […]

ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మరో రెండు రోజుల్లో నిషేధిత

విధాత,న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మరో రెండు రోజుల్లో నిషేధిత జాబితాలోకి వెళ్లనున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధలపై ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు మే 26తో ముగుస్తుండడంతో ఇక ఇండియాలో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ కార్యకలాపాల్ని కొనసాగించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.

ఫిబ్రవరి 26న ఈ నిబంధనల విడుదల సమయంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ “ఓటీటీ మాద్యమాల్లో మూడు అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.ఓటీటీ, డిజిటల్ న్యూస్‌ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని మేము చెప్పడం లేదు, కేవలం వాటి నుంచి సమాచారం మాత్రమే కోరుతున్నాం” అని అన్నారు. కేంద్రం ఇచ్చిన గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలకు ఒకే ఒక్క సంస్థ స్పందించి అంగీకరించింది. మిగతా ఏ సంస్థ కూడా దీనిపై స్పందించలేదు. దీంతో ఆయా సంస్థలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోందని సమాచారం.

సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలు:

ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సిందే.ఏదైనా దర్యాప్తు లేదా సైబర్ సంబంధిత ఘటనలపై అడిగిన 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాలి.లైంగిక చర్యలకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు అందిన రోజునే తప్పనిసరిగా స్పందించాలి.

జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు కంపెనీ తప్పనిసరిగా అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి మరొక అధికారిని తప్పనిసరిగా నియమించాలి. అయితే ఈ అధికారులు తప్పని సరిగా భారతీయులై ఉండాలని కొత్త నిబంధనల్లో కేంద్రం పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ నిబంధనల్లో చిన్న చిన్న మార్పులతో పాటు మరిన్ని నిబంధనలు చేర్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర అధికార వర్గాలు పేర్కొన్నాయి.