మంగ్లీ కేసులో కీలక మలుపు !
మంగ్లీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుడి ఖాతా నుంచి శివ చౌహాన్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
వందల కోట్ల మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ, ఆయన సోదరుడి శివ చౌహాన్ లపై నమోదైన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మంగ్లీ సోదరుడి అకౌంట్లు పరిశీలించిన పోలీసులు నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివచౌహాన్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్లుగా గుర్తించారు. మూడుసార్లు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు గుర్తించగా…డబ్బులు పడిన తర్వాత రోజే నగదు విత్ డ్రా చేసినట్లుగా పోలీసు విచారణలో తేలింది. దీంతో రమావత్ మధు అకౌంట్‌ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) సీజ్ చేసింది.
కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రమావత్, హిమకాంత్ రెడ్డి, శివచౌహాన్కు చెందిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖ రాశారు. తర్వాత క్రమంలో మంగ్లీ అకౌంట్లను కూడా పరిశీలించాలని నిర్ణయించడంతో ఈ కేసు ఆసక్తికరంగా సాగుతుంది. నిందితుడు రమావత్ మధు.. అధిక వడ్డీ పేరుతో వేల మంది నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ ఇప్పటికే మీడియా వేదికగా ప్రకటించారు. అయితే శివ చౌహాన్ ఖాతా నుండి నగదు బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుండి వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి మళ్లింది? దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
దేశంలోనే అధికంగా తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి
‘కోహినూర్ వజ్రం’ను భారత్ కు ఇవ్వాల్సిందే: న్యూయార్క్ మేయర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram