వేయి స్తంభాల గుడిలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా!
వరంగల్ వేయి స్తంభాల గుడిని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా దర్శించారు. శిల్పకళను తిలకిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరంగల్‌లోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలోని విశేషాలను పరిశీలిస్తూ, భక్తిభావంతో పూజలు నిర్వహించారు. కాకతీయ రాజుల పాలనలో అద్బుత శిల్పకళతో నిర్మితమైన ఈ చారిత్రాత్మక ఆలయ ప్రాంగణంలో నంది విగ్రహం, మదనికలు సహా గుడిలోని శిల్పకళా చాతుర్యాన్ని తిలకించారు. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి లెజినోవా అబ్బుర పడ్డారు. ఆలయంలో పలు ఫోటోలు దిగారు.
అన్నా లెజినోవా రష్యన్ జాతీయురాలైనప్పటికీ, హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను ఎంతగానో ప్రేమిస్తారనడానికి ఈ పర్యటన మరో నిదర్శనంగా నిలిచింది. తరచూ ఆమె హిందూ ఆలయాలను దర్శిస్తు పూజలతో సందడి చేస్తుండటం ఆసక్తికరం. గతంలో ఆమె తిరుమ శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించడం విశేషం.
ఇవి కూడా చదవండి :
ఈ-సిగరెట్ ఎఫెక్ట్…రియాన్ పరాగ్ కు శిక్ష ఖరారు
వీడెక్కడి బౌలర్..ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఓ లుక్కెయ్యండి !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram