ఈ-సిగరెట్ ఎఫెక్ట్…రియాన్ పరాగ్ కు శిక్ష ఖరారు
డ్రెస్సింగ్‌రూమ్‌లో ఈ-సిగరెట్ తాగిన రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.
డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ (వేపింగ్) తాగిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు చేపట్టింది.అతడి మ్యాచ్ ఫీజులో జరిమానాతోపాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఆటగాళ్లు, జట్టు అధికారుల కోసం ఉద్దేశించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు పరాగ్‌కు మ్యాచ్‌లో 25 శాతం ఫైన్‌తోపాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.
మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా.. పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రియాన్ తన తప్పును అంగీకరించినట్లు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను పరాగ్ అంగీకరించాడని బీసీసీఐ పేర్కొంది. భారత్ లో 2019లో ఈ-సిగరెట్ల తయారీ, విక్రయాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీనిని ఉల్లంఘించిన వారు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానాకు గురవుతారు. రియాన్ పరాగ్ వేపింగ్ వ్యవహారంపై రాజస్థాన్ యాజమాన్యం ఇంకా స్పందించలేదని సమాచారం.
Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .
Vaping is illegal in India . Hello @BCCI is this allowed?
#PBKSvsRR pic.twitter.com/banIgJDO6u
— Surbhi (@SurrbhiM) April 29, 2026
ఇవి కూడా చదవండి :
వీడెక్కడి బౌలర్..ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఓ లుక్కెయ్యండి !
హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం..లోయలో పడిపోయిన కారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram