మేం ప్రాణాలను కాపాడుకునే దారిలో వెళతాం. మీరు చర్చిస్తూ ఉండండి..
విధాత :ఇవాళ్టికి ఈ దేశంలో 50 శాతం జనాభాకి అలోపతి వైద్యం అందుబాటులో లేదు. నగరం, పల్లె,అడవి, ఆర్థికం,నమ్మకం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.అందులో ఒకటి ఏమంటే…. నకిలీ వైద్యులు అలోపతి పేరుతో డబ్బులు గుంజి కుటుంబాలను రోడ్డుమీద పడేస్తున్నారు.లాభాల కోసం నకిలీ మందులు అమ్మి సొమ్ము గడిస్తున్నారు.అలా పేద ప్రజల నిరుపేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇదంతా శాస్త్రీయత పేరుతో జరుగుతోంది.ప్రభుత్వం ఈ మోసాలను అరికట్టలేక దానికి లొంగిపోయి,ఆ మోసం, దగా లోభాగస్వామి అయ్యింది. ప్రత్యామ్నాయ […]

విధాత :ఇవాళ్టికి ఈ దేశంలో 50 శాతం జనాభాకి అలోపతి వైద్యం అందుబాటులో లేదు. నగరం, పల్లె,అడవి, ఆర్థికం,నమ్మకం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.అందులో ఒకటి ఏమంటే…. నకిలీ వైద్యులు అలోపతి పేరుతో డబ్బులు గుంజి కుటుంబాలను రోడ్డుమీద పడేస్తున్నారు.లాభాల కోసం నకిలీ మందులు అమ్మి సొమ్ము గడిస్తున్నారు.అలా పేద ప్రజల నిరుపేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇదంతా శాస్త్రీయత పేరుతో జరుగుతోంది.ప్రభుత్వం ఈ మోసాలను అరికట్టలేక దానికి లొంగిపోయి,ఆ మోసం, దగా లోభాగస్వామి అయ్యింది. ప్రత్యామ్నాయ సంప్రదాయ వైద్య రీతులను ప్రభుత్వం పక్కన పెట్టింది.
ప్రజలు తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్య విధానాలను వాడుకోక తప్పటం లేదు. ఇది గమనించని శాస్త్రీయ వాదులు వాటిని వాడే ప్రజలను అవమానిస్తున్నారు. వాళ్ల ఆర్థిక సామాజిక స్థితిగతులను గుర్తించడం లేదు.ఇలా మాట్లాడే వాళ్లలో చాలామంది అట్టడుగు వర్గాల వాళ్లే, అంటరాని వాళ్లే,నిజానికి ఫేస్బుక్లో శాస్త్రీయత గురించి మాట్లాడే నలుగురి ముఠా సభ్యులు అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారే కావడం విచిత్రం.వారి ఇంట్లో వాళ్లు పుట్టేనాటికి వాళ్ల తల్లులకు మంగలి మంత్రసానులులే డెలివరీ చేశారు.చిట్కా వైద్యం చేసి వారి అమ్మలు వీళ్ళని రోగాల నుంచి గట్టెక్కించారు. నిజానికి మన దేశంలోనే కాదు చాలా దేశాలలో మంగలి వారే మన తొలి వైద్యులు.
ఈ విషయం నిరూపణ అయినదే .చరిత్రతో, ప్రజలతో సంబంధం లేని మనుషులు తమని తాము మేధావులుగా భావిస్తారు. వీరు తమనితాము ఏమని భావించినా సంస్కరణ వాదులే.అంతిమంగా వీరి ఆలోచనలు పెట్టుబడిదారీ సమాజానికి ఉపయోగపడే పరికరాలే.పండించే పంటలో, పండ్లను కృత్రిమంగా పండించడంలో వాడే విష రసాయనాలను గుర్తించకుండా, వాటిపై పోరాటం చేయకుండా కేవలం శాస్త్రీయత శాస్త్రీయత అని పిచ్చి అరుపులు అరుస్తున్నారు.
ఒక్కసారి భారతీయ సామాజిక వాస్తవికత గుర్తించి మాట్లాడితే చర్చిస్తే ఏమైనా చెప్పగలం.బుర్రనిండా యాంత్రికత, అర్రల నిండా పనికిరాని పేజీలు …. ఇది వీరి అవగాహన.వీళ్ళ సపోర్టు చూసి అల్లోపతి డాక్టర్లని కొందరు అనుకుంటున్నారు.అది తప్పు.వీళ్ళు వైద్య మాఫియా కొనసాగింపు దారులు.లాభార్జన లేని మానవీయ వైద్యాన్ని అలోపతి తో పోటీ పెట్టి తమ ఆధిక్యతను ప్రదర్శించు కుంటున్నారు.ఇది పెద్ద తప్పు.సంప్రదాయ వైద్యాన్ని అభివృద్ధి పరచాలనే ఆలోచన లేని వీళ్ళ మాటలకి విలువ లేదు.లక్షలాది మంది అటు వైపు చూస్తూ ఉంటే అంత మందిని కూడా అవమానపరుస్తూ ఉండడం పెద్ద నేరం.
మానవ పరిణామ క్రమంలో అభివృద్ధి చెందిన వైద్య విధానాన్ని,ఆలోచనలను దెబ్బకొట్టే తీరుగా ప్రవర్తించడం వ్యక్తిగత అహంభావం కిందికే వస్తుంది.నకిలీ మందుల వ్యాపారాన్ని సజావుగా సాగిస్తూ, అలోపతిని గుడ్డిగా నమ్మే వీళ్లు రేపు తమకు,తమ కుటుంబ సభ్యులకు, మిత్రులకు అ లోపతి నకిలీ డాక్టర్లు, నకిలీ వైద్యుల బారిన పడితేఏం చేస్తారు. అయితే ఆయుర్వేదంలో చిట్కా వైద్యం లో నకిలీ వైద్యులు లేరు అంటే చాలా తక్కువమంది ఉన్నారు ఎందుకంటే అందులో డబ్బు లేదు.
నకిలీ ఆయుర్వేద వైద్యులు కూడా ఉన్నారు.ఎందుకంటే అక్కడ కూడా వ్యాపారం ఉంది,కానీ ఆనందయ్య ల వంటి వాళ్ళు తమకు తోచిన రీతిలో మానవీయంగా,లాభార్జన లేకుండా మందులు ఇస్తున్నారు.నమ్మడం నమ్మకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది. దానిని పెద్ద ఎత్తున తయారు చేయాలంటే పరీక్షకు నిలబెట్టాలి.కానీ ఆయనకు ఆ ఉద్దేశమే లేదు కదా. ఫస్ట్ కం ఫస్ట్ సర్వీస్ బేసిస్ లో వాళ్లు మందులు ఇస్తున్నారు,.. తమ వద్ద ఉన్నంత మేరకు.
ఎవరికైనా ఆయుర్వేదం పట్ల అది ఒక మతానికి గాని,ఒక కులానికి గానిసంబంధించినదని ఆలోచన ఉంటే ఏమీ చేయలేం. ఆయుర్వేదంలో కూడా వర్గ భేదాలు ఉన్నాయి.
కుల భేదాలు ఉన్నాయి.రాజులకు డబ్బున్న వాళ్లకు ఆయుర్వేద మందులు తయారు చేసి ఇచ్చే సంప్రదాయం ఉంది.దానిని ఉన్నత బ్రాహ్మణ కులాల వారు లో కొందరు వైద్యులుగా, భిషక్కులుగా తయారు చేసి ఇస్తారు.రెండోరకం ఆయుర్వేదంలో అట్టడుగు వర్గాల వాళ్ళు గ్రామాలలో,అడవుల్లో,సంచార బృందాలుగా సంచరించే వాళ్లకి మందులు తయారు చేసి ఇస్తారు.తమ ఆస్పత్రుల్లోనే వాడాలని తమ బ్రాండ్ మందులనే వాడాలని వాళ్లు అనరు.జీవిక కోసం కుటుంబాన్ని కోసం పని చేసుకుంటూనే ఈ పని కూడా చేస్తారు.నిజానికి ప్రతి కులానికి ఒక వైద్యుడు,పురోహితుడు ఉంటారు.అప్పుడప్పుడూ ఈ రెండు పాత్రల్ని ఒక్కరే పోషిస్తారు.వీళ్ళ వద్ద వేలాది తాటి పత్ర గ్రంథాలు రాతప్రతులు ఇప్పటికీ ఉన్నాయి.వాటిలో basavarajeeyam కూడా ఉంది.ఈ వైద్యులు కేవలం మనుషులకే కాదు పశువులకు పక్షులకు కూడా వైద్యం చేస్తారు.అశ్వశాస్త్రము ఉంది. పశు శాస్త్రము ఉంది.అందుకు సంబంధించిన అనేక గ్రంథాలు అచ్చయ్యాయి అచ్చు కానివి కూడా ఉన్నాయి.అలాంటి వాటిలో పర్షియన్ అరబిక్ ఉర్దూ భాషల్లో కూడా వైద్య గ్రంధాలు ఉన్నాయి.ఎవరైనా అలాంటి గ్రంథాల లిస్ట్ కావాలని అడిగితే చూపించగలరు.
ఏతా వాతా తేలిందేమిటంటే అనేక వేల సంవత్సరాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులం, ఒక్కొక్క బృందం,ఒక్కో సమూహానికి తరచుగా వచ్చే కొన్ని జబ్బులకు వాళ్లే మందులు ఇస్తారు. పలు ప్రాంతాలలో సంచరించడం వల్ల వచ్చే జబ్బులు కూడా వేరే మందులు తయారు చేస్తారు.దీనిని అనుభవ వైద్యం అని కూడా అంటారు.ఇదే పేరుతో పుస్తకం అచ్చయింది కూడా.ఇలాంటి పుస్తకాలు కోకొల్లలుగా ఉంటాయి.ఆనాడు ఎవరూ ఈ వైద్య విధానాలను శంకించి లేదు అశాస్త్రీయమైన లేదు.ముఖ్యంగా బ్రాహ్మణీయ వర్గాలు,పెద్ద కులాల వారు కూడా.ఎందుకంటే అది ప్రకృతి వైద్యం.విషాన్ని కూడా అమృతం గా మార్చే శక్తి వారికి ఉంది.అది ప్రకృతి ప్రసాదించిన వరం మాత్రమే.ప్రాచీన కాలంలో రాచపుండు అనేవాళ్ళు.అంటే అది క్యాన్సర్.దానిని కూడా తగ్గించే వాళ్ళు అనేక మంది ఉండేవాళ్ళు.పెరటి మొక్కల తో అమ్మ అమ్మలు మనని కాపాడారు.ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా మనం ఈసడించు కుందామా.
ప్రజలు సంస్కారవంతులు.కాబట్టి వాళ్లు ఇప్పటి వరకు నోరు తెరవలేదు,శాస్త్రీయత పరీక్షలు అనేవాళ్ళు ఆనందయ్య లాంటి వాళ్ళు ఇచ్చే మందులు మీరు వాడకండి మేం వాడుకుంటా మీరెవరు చెప్పడానికి అని ప్రశ్నించ లేదు ఇప్పటివరకు.నాకు డబ్బు లేదు నేను ఫ్రీ గా ఇచ్చే ఆ మందును వాడుకుంటాను చచ్చిపోయినా పర్వాలేదు. అలోపతి ఆస్పత్రిలో చేరలేను.పడకలు లేవు అక్కడ.మందులు లేవు అక్కడ. చావడానికి మందు కొనలేను. ఇల్లు పొలం బంగారం అన్ని అమ్మి నేను బతకడం కంటే మరణించడమే మేలు అని అంటే ఏం జబాబు చెబుతాం.
శాస్త్రీయత ఉండవద్దని, పరీక్ష పెట్టవద్దని ఎవరూ అనడం లేదు.భయంకరమైన చావుల మధ్య,అంటువ్యాధుల మధ్య,జీవన్మరణ పోరాటం మధ్య ప్రజల తరఫున నిలిచి మాట్లాడాలి తప్ప,వాళ్లకి అందని నిచ్చెనలు వేసి దాని కొలమానాల కొలతలు లెక్కించడం అమానవీయం.అశాస్త్రీయం.
అసందర్భ ప్రేలాపనలు
మీకు కోడి వస్తే ఆస్పత్రుల్లో చేరారా, అలోపతి మందులు వాడరా అని ప్రశ్నిస్తున్నారు ఈ కుహనా మేధావులు.తప్పకుండా పోతాం.డబ్బులు పెట్టి మాత్రం చావము. అంత డబ్బు మా దగ్గర లేదు.ఆసుపత్రిలో బెడ్లు ఉన్నాయా రా నాయనా. అది ముందు చెప్పు.మీ లాగా పైరవీలు చేసుకునే స్తోమత మాకు లేదు. కాళ్ళ వేళ్ళ పడే బతుకు మాది కాదు. పాఠాలు చెప్పడం మానుకొండని ప్రజలు అంటున్నారు.ముందుచూపు లేని ప్రభుత్వాలు,మూడుపుల కోసం ఆశపడే నాయకులు,ప్రజారోగ్యాన్ని,ప్రజల శ్రేయస్సు ని పట్టించుకోని రాజకీయాలు కేవలం ఒక్క అలోపతినే ప్రోత్సహించింది.ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు ని పక్కన పెట్టింది.ప్రైవేటు ఆస్పత్రుల,ఫార్మా కంపెనీల మాయాజాలం లో పడిపోయింది.ఇదే ప్రభుత్వం ఊరికి మెడికల్ కాలేజీ పెట్టి డబ్బులకు సీట్లు అమ్ముకున్నారు.ఇంత జరిగినా మీరు ఎన్నడూ కళ్ళు తెరవలేదు.ఇంత కుళ్ళు ని చూసి మీరు ఊరుకున్నారు.ఇప్పుడు శాస్త్రీయత అని ఊదరగొడుతున్నారు.అయ్యో పిచ్చి నాయనలారా అంతర్జాతీయంగా నిషేధించినా అనేకానేక వందలాది మందులను శాస్త్రీయత పేరుతో డాక్టర్లు రాస్తూంటే, షాపుల్లో బహిరంగంగా అమ్ముతుంటే మీ తెలివి ఎక్కడ పోయింది? అవన్నీ శాస్త్రీయమే అంటారా.
మాకేమీ ఆనందయ్య మందే వాడాలని లేదు. మీ పేదలను మా దగ్గర మందు లేదు మాకు అలోపతి మీద విశ్వాసం లేదు మీరు మా ప్రాణాలకు అడ్డు ఇస్తామని మాట ఇచ్చి మా ఏ మందైనా ఇవ్వండి వాడతాం.ఒకవేళ తేడా వస్తే మీరు బాధ్యత వహిస్తారా..మా ప్రాణాలు కాపాడుకోవాలని మాకు ఉండదా.ప్రాణాలను తీయాలని ఆనందయ్య లో అనుకుంటారా. ప్రత్యామ్నాయం లేదు నాయనా.హలో అలోపతి మందుల వల్ల, ఆ డాక్టర్ల వల్ల,వాళ్ల ఆస్పత్రుల వల్ల ఒక ఇంటిలో ఇద్దరు కోల్పోయిన వాడు,మూడో వాడిని బతికించడం కోసం ప్రత్యామ్నాయం కనిపిస్తే అక్కడికి పోతే అవమానించడం సరి కాదు.అమ్మ పెట్టదు అన్న చందంగా ఉన్నాయి రాతలు.మీరు ఏ మందులు అయినా వాడండి.మాకు అభ్యంతరం లేదు.మేము మా స్థాయిని బట్టి,అందుబాటును బట్టి,ఆర్థిక అన్ని బట్టి మా చావు మేము చస్తాం.ఇప్పుడు మా చావులేని కూడా మీ తెలివి మాలిన తెలివితేటలతో చంపకండి.
ఇప్పుడు మాకు స్నేహహస్తం కావాలి.
భయాందోళనలను నుండి దూరం చేసే ఒక అశ్వాసన కావాలి.ఇప్పుడు మేము ఏమీ చూసే పరిస్థితిలో లేo. పడకలు లేకపోయినా చెట్ల కింద ఉంటాం.ఎంత దూరమైనా కాలినడకన పోతాం.మమ్మల్ని నోట్ల కట్టల్లా కాకుండా మనుషుల్లా చూసే వాళ్ళ దగ్గరకే పోతాం.మా శరీరాల్ని ప్రతిఘటనాస్త్రాలుగా చేయడానికి సిద్ధం.
మాకు ఇప్పుడు ఒక అశ్వాసన కావాలి.మీరు ఇవ్వలేరని తెలుసు.మా వ్యధాభరిత జీవనంలో ఇలాంటి వ్యాధి ప్రభంజననాలను గెలిచిన వాళ్ళ సంతానాలం.ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు తెలుసు.మా ఆగ్రహం కట్టలు తెగుతుందని తెలిసి, దానిని మీరు పక్కదారి పట్టించడానికి చూస్తున్నారనీ తెలుసు.
- జయధీర్ తిరుమల రావు