ఈ హీరోలకు ఇప్పుడు హిట్ చాలా ముఖ్యం..!
విధాత: టాలీవుడ్‌లో సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తెలుగు చిత్రాలను మాత్రమే టార్గెట్ చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. ఇక యంగ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి పలువురు స్టార్స్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ చిత్రాలపై దృష్టి పెట్టారు. ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో టైప్ 2 హీరోలుగా పేరు తెచ్చుకున్న స్టార్లకు ఇప్పుడు విజయం అత్యంత ముఖ్యం. మెగా […]

విధాత: టాలీవుడ్‌లో సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తెలుగు చిత్రాలను మాత్రమే టార్గెట్ చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. ఇక యంగ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి పలువురు స్టార్స్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ చిత్రాలపై దృష్టి పెట్టారు.
ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో టైప్ 2 హీరోలుగా పేరు తెచ్చుకున్న స్టార్లకు ఇప్పుడు విజయం అత్యంత ముఖ్యం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఆయన ఎఫ్2 తరువాత ఆ స్థాయి హిట్టును అందుకోలేక పోయారు.
గద్దల కొండ గణేష్ మంచి హిట్టే కానీ ఈ చిత్రం తర్వాత వచ్చిన గని వంటి చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఎఫ్ 3 చిత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం అయిన ప్రవీణ్ సత్తార్‌తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా గాండీవ ధారి అర్జున అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విజయం వరుణ్ తేజ్‌కు ఎంతో ముఖ్యం.
ఇంకా యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ విషయానికి వస్తే ఆయనకు ఒక హిట్ వస్తే మూడు ఫ్లాపులు వస్తున్నాయి ఇస్మార్ట్ శంకర్‌తో మరల ట్రాక్ లోకి వచ్చాడని చాలామంది భావించారు. కానీ ఆ వెంటనే ఆయన చేసిన రెడ్, ది వారియర్ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో బోయపాటి చిత్రం అత్యంత కీలకంగా కానుంది.
మరో టైప్2 హీరో నితిన్ ఇటీవల వరుసగా రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాలతో డిజాస్టర్స్ అందుకున్నారు. దీని ఫలితంగా నితిన్‌కు అర్జెంటుగా ఓ హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా చేస్తున్నారు.
అక్కినేని అఖిల్ విషయానికి వస్తే ఆయన చేసిన మొదటి నాలుగు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ చిత్రం పై గంపెడాశలు పెట్టుకున్నాడు.
మరోవైపు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 2019లో చిత్రలహరి, ప్రతిరోజు పండగే చిత్రాలతో విజయం సాధించారు. కానీ మూడేళ్లుగా ఆయనకు హిట్ లేదు. సోలో బతుకే సో బెటరు, రిపబ్లిక్ వంటి చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. దాంతో ఆయన విభిన్న ప్రయత్నంగా చేస్తున్న విరూపాక్ష చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు.
ఇంకా గోపీచంద్ విషయానికి వస్తే వరుస ఫ్లాపులలో ఉన్నారు. సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్, పంతం, చాణక్య, సిటీమార్, ఆరడుగుల బుల్లెట్టు, పక్కా కమర్షియల్ వంటి చిత్రాలన్నీ బాగా ఆడలేదు. దాంతో ఆయన దృష్టి అంత ఇప్పుడు రామబాణం చిత్రం పైనే ఉంది. దీంతో ఈ యంగ్ హీరోలు, స్టార్లకు విజయం అత్యంత కీలకమని చెప్పాలి. వారి రాబోయే చిత్రాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.