Payal Rajput | దర్శకులు వాడుకున్నారు.. పాయల్‌ అంత మాట అనేసిందేంటి?

Payal Rajput విధాత‌: ఓ సినిమా హిట్ అయితే స్టార్ హీరోయిన్ అని.. వరుస ఫ్లాప్స్‌తో అవకాశాలే రాకపోతే ఫ్లాప్ హీరోయిన్ అని, ఐరన్ లెగ్ అనే ముద్రలు వేసేసి తరిమికొట్టేయడం సినీ ఇండస్ట్రీకి మొదటి నుంచీ ఉన్న అలవాటే. అందుకే అంటారు ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని’. దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ‘ఇల్లు కాలాకా ఆకులు పట్టుకున్న చందాన’.. ఇప్పుడు మీడియాకు తన గోడు వెళ్ళబోసుకుంటుందీ అమ్మడు. పాయల్ […]

Payal Rajput | దర్శకులు వాడుకున్నారు.. పాయల్‌ అంత మాట అనేసిందేంటి?

Payal Rajput

విధాత‌: ఓ సినిమా హిట్ అయితే స్టార్ హీరోయిన్ అని.. వరుస ఫ్లాప్స్‌తో అవకాశాలే రాకపోతే ఫ్లాప్ హీరోయిన్ అని, ఐరన్ లెగ్ అనే ముద్రలు వేసేసి తరిమికొట్టేయడం సినీ ఇండస్ట్రీకి మొదటి నుంచీ ఉన్న అలవాటే. అందుకే అంటారు ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని’. దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.

‘ఇల్లు కాలాకా ఆకులు పట్టుకున్న చందాన’.. ఇప్పుడు మీడియాకు తన గోడు వెళ్ళబోసుకుంటుందీ అమ్మడు. పాయల్ రాజ్‌పుత్ ‘RX100’ సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చేసుకుంది. తర్వాత హిట్ పడి ఉంటే తన కెరియర్ ఎక్కడో ఉండాల్సింది.

కానీ రాంగ్ రూట్‌లో వెళ్ళి మెయిన్ రోడ్డు మరిచిపోయింది. ఎంచుకున్న సినిమాలు, చేసిన వెబ్ సిరీస్‌లు ఏవీ అమ్మడికి కలిసిరాలేదు సరికదా.. సాదా నటనతో సాగిపోయాయి. ఎంత గ్లామర్ ఒలకబోసినా నటనకు స్కోప్ లేక చప్పగా చతికిలపడ్డాయి.

తన కెరియర్‌కి మంచి సినిమాలు పడి ఉంటే ఎక్కడో ఉండాల్సిన పాయల్.. RX100 తర్వాత సరైన ఆఫర్స్ రాక, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా మరుగున పడిపోయింది. ఈ సినిమా తర్వాత కొన్ని ఛాన్స్‌లు వచ్చినా, బోల్డ్ పాత్రలే తప్ప.. అమ్మడి నటనకు ప్రాధాన్యం లేకపోవడంతో పెద్దగా పేరు రాలేదు. తాజాగా పాయల్ నటించిన ‘మాయాపేటిక’ సినిమా విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

RX100 సినిమా తర్వాత తనను మిస్ గైడ్ చేశారని, కొందరు దర్శకులను గుడ్డిగా నమ్మడంతో.. వాళ్లంతా తనని వాడుకున్నారని, సినిమాల ఎంపికలో ఇచ్చిన సలహాలు కూడా తప్పుడు సలహాలయ్యాయని చెప్పుకొచ్చింది. వాళ్ల గురించి తెలుసుకుని వెనక్కు వచ్చేసరికి అంతా అయిపోయిందట.

ప్రస్తుతం తన సినిమాల విషయంలో, కథల విషయంలో తనే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, అప్పటి బ్యాచ్ మొత్తాన్ని పక్కన పడేశాననే విధంగా పాయల్.. అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేసింది.

దీంతో ఇప్పుడు తనని తప్పుడు దారిలో తీసుకుపోయిన వారు ఎవరనే విధంగా తెగ సెర్చింగ్ మొదలైంది. వాళ్ళెవరో తెలుసుకోవాలని తెగ ఆతృతగా ఉన్నారట ప్రేక్షకులు, ఇటు సినీ జనాలు. అయినా ఒకటీ రెండు సినిమాలంటే ఓకే.. ఇంత జరుగుతున్నా.. పాయల్‌కి కనువిప్పు కలగలేదంటే.. తప్పు ఆమెది కూడా ఉందనే చెప్పుకోవాలి.