Breast feeding | పాలిచ్చే తల్లులు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి! లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..!
Breast feeding | తల్లి పాలు పసిపాప ఆరోగ్యానికి ప్రాణాధారం. తల్లి చనుబాలు బిడ్డ జీవిత కాలానికి సరిపడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అంతేకాదు.. బ్రెస్ట్ ఫీడింగ్‌తో శిశువుకు ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించొచ్చు. రోగ నిరోధక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. పసిపాప ఆకలి తీర్చే ఆ అమృతధార గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే.. కాబట్టి రోజుకు తల్లిపాలు ఏడు నుంచి ఎనిమిది సార్లు పడితే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పాలిచ్చే తల్లులు మాత్రం ఈ […]

Breast feeding |
తల్లి పాలు పసిపాప ఆరోగ్యానికి ప్రాణాధారం. తల్లి చనుబాలు బిడ్డ జీవిత కాలానికి సరిపడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అంతేకాదు.. బ్రెస్ట్ ఫీడింగ్‌తో శిశువుకు ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించొచ్చు. రోగ నిరోధక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. పసిపాప ఆకలి తీర్చే ఆ అమృతధార గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే.. కాబట్టి రోజుకు తల్లిపాలు ఏడు నుంచి ఎనిమిది సార్లు పడితే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే పాలిచ్చే తల్లులు మాత్రం ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్, కేఫిన్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో పాటు పాదరసం ఓ మోతాదులో ఉండే చేపలను కూడా తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
వీటికి దూరంగా ఉంటే మంచిది..
- దాదాపు అన్ని చేపల్లో కొంత మోతాదులో పాదరసం ఉంటుంది. ఈ ఆహారం తీసుకున్న తల్లుల పాలు శిశువు తాగడం వల్ల వారి మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం, కొవ్వు తక్కువగా ఉండటం మంచిదే. కానీ పాదరం స్థాయిలు కూడా ఓ మోతాదులో ఉంటాయి కాబట్టి.. పాలిచ్చే తల్లులు వాటికి దూరంగా ఉంటే మంచిది. షార్క్, స్వార్డ్ ఫిష్, లైట్ ఫిష్ వంటి చేపలను పూర్తిగా దూరంగా ఉంచాలి.
- కొత్తిమీర, పుదీనా కూడా అధిక మోతాదులో తీసుకోవద్దు. ఈ రెండింటిలో యాంటీగాలక్టోగోగస్ అధికంగా ఉంటుంది. దీని వల్ల రొమ్ముల్లో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది.
- తరచుగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతోంది. దీంతో శిశువు పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- కాఫీ, సోడా, టీతో పాటు చాక్లెట్స్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో కేఫీన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల శిశువు నిద్రకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి.
- ఇంట్లోనే బాగా ఉడించిన కూరగాయలను తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేయబడ్డ ఆహారం తీసుకోవడం వల్ల శిశువుకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు, ఇతర రోగాల నుంచి బయటపడొచ్చు.