Health tips | ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఈ ఆకులతో మధుమేహం, ఊబకాయం రెండింటికీ చెక్..!
Health tips : ఇప్పటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్యాలు ప్రబలుతున్నాయి. మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది అనేక ప్రయత్నాలు చేసి కూడా విఫలమవుతున్నారు.
Health tips : ఇప్పటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్యాలు ప్రబలుతున్నాయి. మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది అనేక ప్రయత్నాలు చేసి కూడా విఫలమవుతున్నారు. అయితే ఈ మధుమేహం, ఊబకాయం సమస్యలకు చెక్ పెట్టేందుకు జామ ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల ఈ రెండు సమస్యలకే కాకుండా అనేక ఇతర అనారోగ్య సమస్యలకు కూడా పరిష్కారం ఉంటుందని అంటున్నారు. జామ ఆకు ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు..
- జామ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో జామ ఆకులతో కూడా అంతకు మించి ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయిల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకులు క్యాలరీ ఫ్రీ. ఇవి బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. జామ ఆకులను పచ్చిగా తిన్నా కూడా రుచిగా ఉంటాయి. కావాలనుకుంటే జ్యూస్‌లా చేసుకుని తాగవచ్చు.
- జామ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జామ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపు పూతల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతాయి. దగ్గు, దురద మొదలైన వాటితో బాధపడుతున్నవారు జామ ఆకులను తినాలి. ఎందుకంటే వీటిలో శరీరానికి ఉపశమనాన్ని అందించే యాంటీ అలర్జీ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు జామ ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- జామ ఆకులలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి శరీరానికి సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. జామ ఆకుల టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతే కాదు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను దూరం చేస్తుంది. పిండి పదార్థాలు చక్కెరలుగా మారడాన్ని జామ ఆకుల సారం నియంత్రిస్తుంది. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
- ఊబకాయంతో బాధపడేవారు జామ ఆకుల టీ తీసుకోవాలి. జామ ఆకులతో తయారు చేసిన టీ తాగడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. జామ ఆకుల టీతో జీర్ణ వ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగుతుంది. ఇందులోని డైటరీ ఫైబరీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జామ ఆకులను తీసుకోవడంతో డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవచ్చు. జామ ఆకులను తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య వేగంగా పెరుగుతుంది. జ్వరం తీవ్రత సైతం తగ్గుతుంది.
- జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మగవారికి మేలు చేస్తుంది. సంతాన లేమి సమస్యను దూరం చేస్తుంది. జామ ఆకుల సారాన్ని తీసుకుంటే స్మెర్మ్ నాణ్యత, కౌంట్ పెరుగుతుంది. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి ఉపశమనం అందిస్తాయి. జామ ఆకులను రెగ్యులర్‌గా తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.
- జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ముడతలు మాయమవుతాయి. మొటిమలు, నల్ల మచ్చలను తొలగించడంతో జామ ఆకులు సహాయపడతాయి. జామ ఆకులు హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. జామ ఆకుల పేస్ట్‌ను అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. జుట్టును ఒత్తుగా మార్చడంలో జామ ఆకుల సారం సహాయపడుతుంది. ఈ రసం తీసుకుంటే జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. జామ ఆకుల పేస్ట్‌ను తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram