Diabetic Patients | బీ అలర్ట్.. షుగర్ పేషెంట్లు బంగాళాదుంప తినొచ్చా..?
Diabetic Patients | ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన శైలి మారింది. ఒడిదుడుకుల జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ అనేక రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ రోగాల్లో ముఖ్యమైంది షుగర్ వ్యాధి( Diabetic Patients ). బిజీ లైఫ్ గడుపుతున్న వారందరికీ షుగర్( Sugar ) అటాక్ చేయడం సాధారణమైంది.

Diabetic Patients | షుగర్( Sugar ) నిర్ధారణ అయిందంటే చాలు మరింత భయాందోళనకు గురవుతారు. ఇక ఏం తినాలి..? ఏయే పదార్థాలు తినకూడదు..? ఎంత సేపు వ్యాయామం చేయాలి..? షుగర్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి..? అనే ప్రశ్నలతో సతమతమవుతుంటారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు( Diabetic Patients ) చేయాల్సిందంతా ఒక్కటే.. మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..
బంగాళాదుంప( Potato )
బంగాళాదుంప( Potato ).. అదేనండి ఆలుగడ్డ. ఈ కూరను అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఈ బంగాళాదుంప షుగర్ పేషెంట్ల( Sugar Patients )కు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. వీటిలో స్టార్చ్ (పిండి పదార్థాలు) చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఉడికించిన బంగాళాదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణం అధికంగా ఉంటుంది. ఇవి సులభంగా జీర్ణం అవ్వడం వల్ల రక్తంలో గ్లూకోజ్ త్వరగా విడుదల అవుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఆలుగడ్డకు దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఆలుగడ్డ అధిక వినియోగం వల్ల టైప్ 2 డయాబెటిస్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
క్యారెట్( Carrot )
క్యారెట్( Carrot )ను కూడా అందరూ ఇష్టంగా తింటారు. అయితే క్యారెట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు( Sugar Levels ) పెరగొచ్చనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పచ్చి క్యారట్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని, కానీ ఉడికించినప్పుడు వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుందని పేర్కొన్నారు. కాబట్టి, డయాబెటిస్ పేషంట్స్ ఉడికించిన క్యారట్లను మితంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
బీట్‌రూట్( Beetroot )
ఇది ఆరోగ్యానికి మేలే కానీ ఇందులో సహజ చక్కెరలు డయాబెటిస్ పేషెంట్స్‌కు అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీట్‌రూట్( Beetroot ) రసం కంటే, ఉడికించి లేదా పచ్చిగా తక్కువ మోతాదులో తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.