Diabetic Patients | షుగర్‌తో బాధ పడుతున్నారా..? వంటింట్లో దొరికే మెంతులతో చెక్ పెట్టండిలా..!
Diabetic Patients | షుగర్ వ్యాధి( Diabetic Patients ) మిమ్మల్ని పట్టిపీడిస్తుందా..? డాక్టర్ల( Doctors ) చుట్టూ తిరుగుతూ.. మోతాదుకు మించి మెడిసిన్స్( Medicines ) వాడేస్తున్నారా..? అదంత అవసరం లేదండి.. వంటింట్లో దొరికే మెంతులు(Fenugreek Seeds ), దాల్చిన చెక్క(Cinnamon ), చియా విత్తనాలతో( Chia Seeds ) షుగర్‌ను ఈజీ కంట్రోల్ చేసుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందాం..
Diabetic Patients | షుగర్( Sugar ).. అదేదో వంటింట్లో వాడే షుగర్ కాదు.. వయసుతో సంబంధం లేకుండా అందర్నీ పట్టిపీడిస్తున్న షుగర్ వ్యాధి( Diabetic Patients ). షుగర్ వ్యాధి.. అదే డయాబెటిస్( Diabetic ) బారిన పడ్డవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి ఒక్కసారి నిర్ధారణ అయిందంటే చాలు.. ఇక పూర్తిగా ఆహారాన్ని కంట్రోల్ చేయాల్సిందే. రక్తంలో గ్లూకోస్ స్థాయి( Glucose Levels ) నియంత్రణ కోసం మెడిసిన్స్( Medicines ) వాడాల్సిందే. అయితే షుగర్‌ను ఆదిలోనే గుర్తించి.. ఆహార నియంత్రణ పాటిస్తే.. ఆ వ్యాధిని మన దరి నుంచి తరిమేయొచ్చని ఆరోగ్య నిపుణులు( Health Experts ) సూచిస్తున్నారు. ప్రధానంగా షుగర్ కంట్రోల్( Sugar Control )కు వంటింట్లో దొరికే కొన్ని రకాల దినుసులు బాగా పని చేస్తాయని చెబుతున్నారు. మరి వంటింట్లో దొరికే ఆ పదార్థాలతో షుగర్‌ను ఎలా కంట్రోల్ చేయొచ్చొ తెలుసుకుందాం..
మెంతులు..( Fenugreek )
షుగర్‌తో బాధపడేవారు మెంతులను( Fenugreek Seeds ) దినచర్యలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయని తెలుపుతున్నారు. మెంతుల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. దాంతో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతాయని, తద్వారా భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా నియంత్రించబడతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు.
మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్( Insulin ) సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఉత్తమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, గ్లూకోజ్ టాలరెన్స్‌ను మెరుగుపరచడం ద్వారా డయాబెటిక్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క( Cinnamon )
దాల్చిన చెక్క( Cinnamon ) కూడా ప్రతి వంటింట్లో ఉంటుంది. ఇది కూడా రక్తంలో షుగర్ లెవల్స్( Sugar Levels )ను నియంత్రిస్తుందని అనేక పరిశోధనల్లో తేలిందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. రోజుకు ఒక గ్రామ్ పరిమాణం కలిగిన దాల్చిన చెక్కను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందట. దాల్చిన చెక్క కార్బోహైడ్రేట్లు జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తుందని, తద్వారా గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
బెండకాయ
చియా విత్తనాలు( Chia Seeds )
చియా విత్తనాల్లో( Chia Seeds ) కరిగే ఫైబర్, ఒమేగా 3 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విత్తనాలను నానబెట్టినప్పుడు జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పస్తుందని, ఇది ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల చక్కెరలు రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతాయని తెలిపారు. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram