Pink Eye | కళ్లకలకలు వస్తే సొంత వైద్యం వద్దు.. వైద్యుల హెచ్చరిక
Pink Eye | ప్రస్తుతం ఉన్న వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో కళ్లకలకలు (Conjunctivitis) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి నుంచి బయటపడటానికి చాలా మంది దగ్గర్లోని మందుల దుకాణాలకు వెళ్లి నచ్చిన మందులను, ఐ డ్రాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఎక్కువ మంది స్టెరాయిడ్ (Steroids) లతో కూడిన చుక్కల మందులను ఉపయోగిస్తున్నారని.. దీని వల్ల అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుని సలహా తీసుకోకుండా స్టెరాయిడ్‌లను ఉపయోగిస్తే దుష్పరిణామాలకు […]

Pink Eye | ప్రస్తుతం ఉన్న వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో కళ్లకలకలు (Conjunctivitis) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి నుంచి బయటపడటానికి చాలా మంది దగ్గర్లోని మందుల దుకాణాలకు వెళ్లి నచ్చిన మందులను, ఐ డ్రాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఎక్కువ మంది స్టెరాయిడ్ (Steroids) లతో కూడిన చుక్కల మందులను ఉపయోగిస్తున్నారని.. దీని వల్ల అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుని సలహా తీసుకోకుండా స్టెరాయిడ్‌లను ఉపయోగిస్తే దుష్పరిణామాలకు ఆహ్వానించినట్లేనని హెచ్చరిస్తున్నారు. కొంత మంది ఒక ఐ డ్రాప్‌ను కొన్ని రోజులు వాడి తగ్గట్లేదని మరో ఐ డ్రాప్‌కు మారుతున్నారని ఇది కూడా ప్రమాదకరమేనని డా. ప్రియాంక సింగ్ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల కళ్లకలకలకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్ ఆ మందులకు అలవాటు పడిపోయి నిరోధకతను సంతరించుకుంటాయని తెలిపారు.
తద్వారా తర్వాత అవి ఏ మందు వేసినా ఉపయోగం ఉండదన్నారు. ‘స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల ఇన్‌ఫెక్షన్ కార్నియాకు పాకి కార్నియల్ అల్సర్ అనే సమస్యకు దారితీయొచ్చు. కన్ను అంతర్గ భాగాల్లో ఒత్తిడి పెరగడం, గ్లుకోమా రావడం, తద్వారా మొత్తం కన్ను అంతర్భాగాలకు ఈ ఇన్ఫెక్షన్ సోకవచ్చు. కొన్ని సార్లు చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదమూ ఉంది’ అని హెచ్చరించారు.
మరేం చేయాలి
కళ్లకలకలు వచ్చాయని తెలియగానే కంటి వైద్యుల నిపుణుణ్ని సంప్రదించాలి. వారు సూచించిన మందులనే ఉపయోగించాలి. పరిస్థితి ఎంతో చేయిదాటిపోతే తప్ప ఎవరికీ స్టెరాయిడ్‌లను వైద్యులు సూచించరు. కాబట్టి సాధారణ మందులను వాడటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యాధి తీవ్రతను బట్టి కృత్రిమ కన్నీరు వచ్చేలా చేయడం, యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్‌ను ఇవ్వడం, యాంటీ వైరల్ డ్రాప్స్, కోల్డ్ కంప్రెసెస్ విధానాల్లో కళ్లకలకలను నివారించేలా వైద్యులు ప్రయత్నిస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చేతులతో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వస్తువులను ముట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కళ్లను పదే పదే నలపడం, తువ్వాళ్లు, చేతి రుమాళ్లను ఒకరివి ఒకరు వాడుకోవడం చేయకూడదు. ఈ వర్షాకాలం కళ్లకలకలు రావడానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.