Health tips | జుట్టుకు తరచూ ఆయిల్‌ మసాజ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

Health tips : జిడ్డుగా ఉంటుందని చాలామంది జుట్టుకు నూనె పెట్టేందుకు ఇష్టపడరు. కానీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలన్నా.. మెదడు, శరీరం రిలాక్స్‌ కావాలన్నా రెగ్యులర్‌గా జుట్టుకు నూనె పెట్టాలి. అలాగే ఆయిల్ మసాజ్ (Oil massage) కూడా చేయాలి. ఇది మీ జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

  • By: Thyagi |    health |    Published on : Jun 22, 2024 4:00 PM IST
Health tips | జుట్టుకు తరచూ ఆయిల్‌ మసాజ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

Health tips : జిడ్డుగా ఉంటుందని చాలామంది జుట్టుకు నూనె పెట్టేందుకు ఇష్టపడరు. కానీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలన్నా.. మెదడు, శరీరం రిలాక్స్‌ కావాలన్నా రెగ్యులర్‌గా జుట్టుకు నూనె పెట్టాలి. అలాగే ఆయిల్ మసాజ్ (Oil massage) కూడా చేయాలి. ఇది మీ జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

  • మనలో ప్రతి ఒక్కరికి జుట్టు పొడుగ్గా, ఒత్తుగా, అందంగా కనిపించాలనే తపన ఉంటుంది. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. రెగ్యులర్‌గా కొత్త హెయిర్ కేర్ టిప్స్‌ను ఫాలో అవుతుంటాం. కానీ చేయాల్సినవి మాత్రం చేయం. జుట్టుకు నూనె పెడితేనే మన వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఆ పని చేయం.
  • జుట్టుకు నూనె పెట్టడంవల్ల వెంట్రుకలకు పోషణ అందడంతోపాటుగా ఒత్తుగా పెరుగుతాయి. నల్లగా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
  • తరచూ ఆయిల్ మసాజ్ చేయడంవల్ల రిలాక్డ్స్ ఫీల్ కలుగుతుంది. చేతివేళ్లతో తలకు మసాజ్ చేసుకుంటే హాయినిస్తుంది. ఇలా చేయడంవల్ల తలనొప్పి, టెన్షన్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఒత్తిడి తగ్గడంతో కండరాలు రిలాక్స్ అవుతాయి.
  • ఎండాకాలంలో చెమటలు పట్టడంవల్ల జుట్టులో జిడ్డు బాగా పేరుకుపోతుంది. జుట్టుకు నూనెతో మసాజ్ చేయడంవల్ల ఈ జిడ్డు సమస్య చాలావరకు తగ్గుతుంది. ఇందుకోసం కొబ్బరినూనె, బాదం నూనె లేదా ఆవనూనెతో తలకు మసాజ్ చేయవచ్చు. ఇది మీ జుట్టును షైనీగా చేస్తుంది.
  • ఎండలో బయటకు వెళ్లడంవల్ల జుట్టు దెబ్బతింటుంది. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు జుట్టును ఎండిపోయేలా చేస్తాయి. సూర్యరశ్మికి జుట్టు దెబ్బతినకుండా ఉండటానికి మీరు రాత్రి పడుకునే ముందు లేదా తలస్నానం చేయడానికి కొన్ని గంటల ముందు హెయిర్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాలి.