Health Tips | మీరు ధూమపానం చేస్తున్నారా..? అయితే కంటి చూపుకు నష్టమే..!
Health Tips | మీకు సిగరెట్, బీడీ తాగే అలవాటు ఉందా..? అయితే మానుకోండి. లేదంటే మీ కంటి( Eye ) చూపుకే ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కంటి చూపు ఒక్కటే కాదు ఊపిరితిత్తులు చెడిపోవడం, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ధూమపానం( Smoking ) వల్ల కంటి చూపుకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరగా కంటి చూపును కోల్పోవడమే కాకుండా, రెండు కళ్లల్లో కూడా శుక్లాలు […]

Health Tips | మీకు సిగరెట్, బీడీ తాగే అలవాటు ఉందా..? అయితే మానుకోండి. లేదంటే మీ కంటి( Eye ) చూపుకే ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కంటి చూపు ఒక్కటే కాదు ఊపిరితిత్తులు చెడిపోవడం, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ధూమపానం( Smoking ) వల్ల కంటి చూపుకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరగా కంటి చూపును కోల్పోవడమే కాకుండా, రెండు కళ్లల్లో కూడా శుక్లాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ మూడింటిపై తీవ్ర ప్రభావం..
సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా కంటిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రెగ్యులర్‌గా సిగరెట్, బీడీ తాగడం వల్ల అస్పష్టమైన దృష్టి ఏర్పడే అవకాశం ఉంది. అంతే కాకుండా అంధత్వానికి కూడా కారణమవుతుంది. ఒక్కసారి సిగరెట్ తాగడం వల్ల రెండు వందలకు పైగా హానికరమైన కెమికల్స్ విడుదల అవుతాయి. ఆ రసాయనాలు కంటిలోకి చేరి కంటిలోని భాగాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా రెటీనా, లెన్స్, మాక్యులాపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. రెటీనానేమో కాంతిని ప్రాసెస్ చేస్తుంది. ఇక లెన్స్ బయటి కాంతి రెటీనాను చేరుకోవడానికి అనుమతిస్తుంది. మాక్యులా చిన్నచిన్న వస్తువులు కూడా కనిపించేలా చేస్తుంది. ఈ మూడు దెబ్బతింటే అంధత్వం వస్తుంది. కాబట్టి ధూమపానాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది.
క్యాన్సర్ కూడా వస్తుంది..
సిగరెట్ తాగిన తర్వాత విడుదలయ్యే పొగలో 7 వేల ఎక్కువ రసాయనాలు ఉంటాయి. వీటిలో 69 రసాయనాలు క్యాన్సర్ కారకాలు. అందుకే సిగరెట్ కాల్చే వారికి నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నిత్యం ధూమపానం చేసే వారిలో మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. బీపీని పెంచుతుంది. పొగాకులో ఉండే నికోటిన్ కళ్లను దెబ్బతీస్తుంది.