Papaya | బొప్పాయి తింటే గ‌ర్భ‌స్రావం జ‌రుగుతుందా..? అందులో నిజ‌మెంత‌..?

Papaya | గ‌ర్భిణుల‌ను బొప్పాయి పండుకు ఆమ‌డ దూరంలో ఉంచుతారు. బొప్పాయి పండు తింటే గ‌ర్భ‌స్రావం జ‌రుగుతుంద‌ని న‌మ్ముతుంటారు. కాబట్టి ఆ పండును తినొద్ద‌ని ఇంట్లో పెద్ద వాళ్లు చెప్తూనే ఉంటారు. అస‌లు బొప్పాయి పండు తిన‌డం వ‌ల్ల నిజంగానే గ‌ర్భ‌స్రావం జ‌రుగుతుందా..? అస‌లు అందులో నిజం ఉందా..? వంటి వివ‌రాలు తెలుసుకుందాం.. గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు బొప్పాయిని తిన‌డం వ‌ల్ల అబార్ష‌న్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని శాస్త్రీయంగా కూడా రుజువైంది. అయితే బాగా మ‌గ్గిన బొప్పాయిని […]

Papaya | బొప్పాయి తింటే గ‌ర్భ‌స్రావం జ‌రుగుతుందా..? అందులో నిజ‌మెంత‌..?

Papaya | గ‌ర్భిణుల‌ను బొప్పాయి పండుకు ఆమ‌డ దూరంలో ఉంచుతారు. బొప్పాయి పండు తింటే గ‌ర్భ‌స్రావం జ‌రుగుతుంద‌ని న‌మ్ముతుంటారు. కాబట్టి ఆ పండును తినొద్ద‌ని ఇంట్లో పెద్ద వాళ్లు చెప్తూనే ఉంటారు. అస‌లు బొప్పాయి పండు తిన‌డం వ‌ల్ల నిజంగానే గ‌ర్భ‌స్రావం జ‌రుగుతుందా..? అస‌లు అందులో నిజం ఉందా..? వంటి వివ‌రాలు తెలుసుకుందాం..

గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు బొప్పాయిని తిన‌డం వ‌ల్ల అబార్ష‌న్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని శాస్త్రీయంగా కూడా రుజువైంది. అయితే బాగా మ‌గ్గిన బొప్పాయిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌దు. కానీ పచ్చి బొప్పాయిని తింటేనే గ‌ర్భ‌స్రావం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది.

ఎందుకంటే ప‌చ్చి బొప్పాయిలో ప‌పాయ‌న్ అనే ఎంజైమ్ అధిక మోతాదులో ఉంటుంది. ఈ ఎంజైమ్ గ‌ర్భ సంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. దీంతో అబార్ష‌న్ జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. అయితే ఒక వేళ బొప్పాయిని తినాల‌పిస్తే.. బాగా మ‌గ్గిన పండును తేనెతో క‌లిపి తీసుకుంటే ప‌పాయ‌న్ ఎంజైమ్ ప్ర‌భావం త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

ఇక పాలు కారే ప‌చ్చి బొప్పాయిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ప్రోస్ట‌గ్లాండిన్స్ అనే హార్మోన్లు అధికంగా ఉత్ప‌త్తి అయ్యే అవ‌కాశం ఉంది. ఇవి కూడా గ‌ర్భ‌సంచి గోడ‌లు కుచించుకుపోయేలా చేస్తాయి. దీంతో అబార్ష‌న్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

కాబ‌ట్టి గ‌ర్భం ధ‌రించాల‌నుకునే వారు, గ‌ర్భిణులు బొప్పాయికి దూరంగా ఉంటేనే మంచిది. ప్రాచీన కాలంలో ఈజిప్టులో బొప్పాయి గింజ‌ల‌ను ఉప‌యోగించి త‌మ వ‌ద్ద ఉంటే ఒంటెల‌ను గ‌ర్భం ధ‌రించ‌కుండా చేసేవార‌ట‌. అలా బొప్పాయికి గ‌ర్భ‌స్రావం చేసే శ‌క్తి ఉన్న‌ట్టు ప్ర‌చారం మొద‌లైంది.

గుండె జ‌బ్బులు ఉన్న‌వారు బొప్పాయిని మితంగా తింటేనే మంచిది. బొప్పాయిలో ఉండే ఆమైనో ఆమ్లం గుండెకు హానిక‌రం. అలాగే హైపోథైరాయిడిజంతో బాధ‌ప‌డే వారు ఈ పండుకు దూరంగా ఉండ‌ట‌మే బెట‌ర్. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయిని దూరం పెట్టాలి. శ్వాస సమస్యలు, జ్వరం, ఆస్తమా వంటి ఉన్న వాళ్లు బొప్పాయిని తినకపోవడమే మంచిది.