Children Health | మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా..? అయితే వారి గుండె ప్రమాదంలో పడినట్టే..
పిల్లల్లో అధిక స్క్రీన్ టైమ్ గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొబైల్ అలవాట్ల వల్ల భవిష్యత్తులో హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.
Children Health | ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రతీ ఒక్కరూ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ తినడమైనా మానేస్తారేమోకానీ, ఫోన్‌ను చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. రీల్స్, పోస్టులు, ఆన్‌లైన్ గేమ్స్, చాటింగ్ అంటూ ఎక్కువ సమయం గ్యాడ్జెట్స్‌తోనే గడిపేస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు (Children Health). ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్, యూట్యూబ్ అంటూ గంటల కొద్దీ మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారు. చివరికి తిండి తినాలన్నా ఫోన్ ఉండాల్సిందే. నిద్రకు ముందు కూడా ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇది వారి ఏకాగ్రతనేకాదు శారీరక, మానసిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని (heart problems) తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం.. అధిక స్క్రీన్ టైమ్ ఉన్న పిల్లలు, టీనేజర్లు భవిష్యత్తులో గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దాదాపు వెయ్యి మందికి పైగా పిల్లలపై స్టడీ చేయగా ఈ విషయం బయటపడింది. పిల్లల నిద్ర, శారీరక శ్రమ, ఆహార అలవాట్లను గమనించి, రక్తపోటు, మంచి కొలెస్ట్రాల్ (HDL), నడుము చుట్టుకొలత, రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలించారు. ఈ స్టడీ ఫలితాల్లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు అదనంగా ఒక గంట స్క్రీన్ వాడితే 6 నుంచి 10 సంవత్సరాల పిల్లల్లో గుండె సమస్యల ప్రమాదం 0.08 శాతం ఉంటుందని తేలింది. అదే టీనేజర్లలో 0.13 శాతం ఉంటుంది. అదేసమయంలో ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని 12 శాతం వరకూ తగ్గిస్తుంది.
పిల్లల గుండె ఆరోగ్యాన్ని పెంచండిలా..
ఈ సమస్యను తల్లిదండ్రులు చిన్నచిన్న మార్పులతో ఎదుర్కోవచ్చు. పిల్లల కోసం రోజువారీ స్క్రీన్ టైమ్‌ను కచ్చితంగా పరిమితం చేయాలి. అందుకోసం కొంత సమయాన్ని మాత్రమే కేటాయించాలి. ఇంట్లో స్క్రీన్ ఫ్రీ జోన్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఫోన్‌ను దూరంగా పెట్టాలి. అదే సమయంలో మీరు కూడా స్క్రీన్ వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులను చూసే పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారన్నది నిపుణుల అభిప్రాయం. పిల్లల ముందు ఫోన్‌లు పట్టుకోకుండా వారితో సరదగా టైమ్ స్పెండ్ చేయడం, కథలు చెప్పడం వంటివి చేస్తే నిదానంగా వారు స్క్రీన్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యోగా, వ్యాయామం వంటివాటిపై దృష్టిపెట్టేలా చర్యలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి :
Donald Trump | గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కొత్త వ్యూహం.. పౌరులకు డబ్బు ఆఫర్..?
Raja Saab | ‘ది రాజాసాబ్’లో అసలు ట్విస్ట్ ఇదేనా? ముగ్గురు కాదు… ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram