పళ్లు – చిగుళ్లు బాగోలేకపోతే గుండెకు యమ డేంజర్..!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న సమస్య — చిగుళ్ల వ్యాధి (Periodontal disease) — తాజాగా గుండెజబ్బులకూ దోహదపడుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

- హార్వర్డ్ విశ్వవిద్యాలయం హెచ్చరిక
- చిగుళ్ల వ్యాధితో గుండెకు చేటు
- నోరే అన్నివ్యాధులకు సింహద్వారం
నోటి ఆరోగ్యం కేవలం దంతాలకు సంబంధించినది కాదు, అది మన హృదయ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్న తాజా హెచ్చరిక హార్వర్డ్ హెల్త్ (Harvard Health) వెలువరించింది. ఇది హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రజారోగ్య సమాచార విభాగం. విశ్వవిద్యాలయ మెడికల్ కాలేజీకి అనుబంధం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న సమస్య — చిగుళ్ల వ్యాధి (Periodontal disease) — తాజాగా గుండెజబ్బులకూ దోహదపడుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
హార్వర్డ్ నివేదిక ప్రకారం, నోటి ఆరోగ్యం బాగోకపోతే గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ రెండు వ్యాధుల మధ్య నేరుగా సంబంధం ఉందా లేక వాటికి సహజంగా సమానమైన ప్రమాదకర కారకాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టంగా నిర్ధారణ కాకపోయినప్పటికీ, ఆరోగ్యవంతమైన జీవనశైలి ద్వారా రెండింటినీ నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిగుళ్ల వ్యాధి–గుండె జబ్బుల మధ్య సంబంధం, చిగుళ్ల వ్యాధికు కారణమయ్యే బ్యాక్టీరియా రక్తప్రసరణలోకి చేరి అందులోని నాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ (Inflammation) కలిగించవచ్చని పరిశోధకుల అభిప్రాయం. మరికొందరు నిపుణుల ప్రకారం, బ్యాక్టీరియా కన్నా అధికంగా దాని పట్ల శరీరం చూపే రోగ నిరోధక వ్యవస్థ ప్రతిచర్యే హాని కలిగించవచ్చు. వీటికి సాధారణ ప్రమాద కారకాలు (Common risk factors) ఉన్నందువల్లా రెండూ కలిసివస్తుండవచ్చని మరో వాదన ఉంది — ఉదాహరణకు ధూమపానం(Smoking), జన్యు ప్రభావం, వ్యాయామం లేకపోవడం(Inactivity).
చిగుళ్ల వ్యాధి లక్షణాలు
- బ్రష్ చేసిన వెంటనే నోరు రక్తం కారడం
- శ్వాస దుర్వాసనగా ఉండటం
- ఎర్రగా, ఉబ్బిన, నొప్పిగా ఉండే చిగుళ్ల కండరాలు
- దంతాల చుట్టూ కండరాలు వెనక్కి తగ్గడం
- పళ్ల కదలిక, ఊగడం
చిగుళ్ల వ్యాధి – గుండెజబ్బులకు సాధారణ ప్రమాద కారకాలు
- ధూమపానం: చిగుళ్లను, గుండెను కలుషితం చేసే ప్రధాన కారకం
- మధుమేహం: నోటి బ్యాక్టీరియాపై శరీర రక్షణ తక్కువగా ఉంటుంది
- అధిక బరువు: శరీరంలో మొత్తంగా ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది
- పోషకాహార లోపం: షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం
నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
- రోజులో రెండుసార్లు బ్రష్ చేయాలి (సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్, ఫ్లోరైడ్ పేస్ట్ వాడాలి) Brush twice a day
- ప్రతి రోజు ఫ్లాస్ వాడాలి floss cleaning
- బ్యాక్టీరియా నాశనం చేసే మౌత్‌వాష్ వాడాలి Mouth wash
- ఆరు నెలలకోసారి డెంటల్ చెకప్ తప్పక చేయించుకోవాలి Dental checkup
చిగుళ్ల వ్యాధి నయం అవుతుందా?
పూర్తిగా నయం కాకపోయినా, ఇన్ఫెక్షన్ నియంత్రణ, బోన్-టిష్యూలు కొంతమేర తిరిగి తయారు చేయడం సాధ్యమే. ప్రారంభ దశలో ఉన్న జింజివైటిస్ వంటివి మారిపోవచ్చు. కాలయాపన చేస్తే మాత్రం పళ్ళకు మద్దతిచ్చే దంతాల చుట్టూ హాని జరిగిపోతుంది.
చిగుళ్ల వ్యాధి ఉన్నవారు ఏం చేయాలి?
- డెంటిస్ట్‌ను సంప్రదించాలి, అవసరమైతే డీప్ క్లీనింగ్, యాంటీబయోటిక్స్ తీసుకోవాలి
- హృదయ నిపుణుడి వద్ద క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవాలి
- ఆహారపు అలవాట్లను మెరుగుపరచాలి, వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి
Harvard Health సూచన ఏమిటంటే – నోటి ఆరోగ్యాన్ని చిన్న విషయం అనుకోకుండా, గుండె కోసం కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే, నోరే అన్ని వ్యాధులకు హైవే.