Health tips | పక్కవాళ్లు నవ్వుతారని వాటిని బలవంతంగా ఆపుకుంటున్నారా.. అది చాలా ప్రమాదం తెలుసా..!
Health tips : జీవి అన్న తర్వాత ఆపానవాయువు వదలడం (పిత్తడం) సర్వసాధారణమైన విషయం. ఆపానవాయువు వదలని మనిషి ఉండరు. కానీ ఆపానవాయువు ముచ్చట వచ్చిందంటే చాలామంది నవ్వుకుంటారు. చీ గలీజ్ ముచ్చట అంటూ ఆ ముచ్చట చెప్పేవాళ్లను ఆపే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఆపానవాయువు వస్తున్నా పక్కనవాళ్లు నవ్వుతారేమోనని బలవంతంగా ఆపుకుంటారు.
Health tips : జీవి అన్న తర్వాత ఆపానవాయువు వదలడం (పిత్తడం) సర్వసాధారణమైన విషయం. ఆపానవాయువు వదలని మనిషి ఉండరు. కానీ ఆపానవాయువు ముచ్చట వచ్చిందంటే చాలామంది నవ్వుకుంటారు. చీ గలీజ్ ముచ్చట అంటూ ఆ ముచ్చట చెప్పేవాళ్లను ఆపే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఆపానవాయువు వస్తున్నా పక్కనవాళ్లు నవ్వుతారేమోనని బలవంతంగా ఆపుకుంటారు. కానీ అది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పక్కవాళ్లు నవ్వుతారని సిగ్గయితే అప్పటికప్పుడే పక్కకు వెళ్లయినా ఆ వాయువును వదలాలని అంటున్నారు. ఆపాన వాయువును ఆపడం వల్ల సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
వాటిని ఆపితే జరిగేది ఇదే..
గ్యాస్ సమస్యలు
పప్పులు, గుడాలు లాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు శరీరం నుంచి గ్యాస్ ఆగకుండా బయటకు వస్తుంది. అలాంటప్పుడు దాన్ని బలవంతంగా ఆపడంవల్ల శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. బయటికి వచ్చే గ్యాస్‌ను బలవంతంగా ఆపడంవల్ల తిరిగి వెళ్లి శరీరంలోనే ఉండిపోతుంది. దాంతో కడుపు ఉబ్బినట్లు, నొప్పిగా అసౌకర్యంగా ఉంటుంది. రానురాను ఉబ్బరం మరింత పెరిగి కడుపునొప్పికి దారితీస్తుంది.
పెద్ద పేగుపై ప్రభావం
సాధారణంగా అపాన వాయువు బయటకు వెళ్లిపోవడంవల్ల పొట్టకు హాయిగా ఉంటుంది. శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. కానీ మలబద్ధకం లాంటి సమస్యతో అది బయటికు రానప్పుడు, లేదంటే బలవంతంగా ఆపానవాయువును ఆపినప్పుడు పెద్దపేగుపై ప్రభావం పడుతుంది. అది హెమరాయిడ్స్‌కు కారణమవుతుంది. అందుకే ఎప్పటి గ్యాస్ అప్పుడు బయటకు వెళ్తేనే రిలీఫ్‌గా ఉంటుంది.
అజీర్తికి మూలం
బయటకు వెళ్లే గ్యాస్‌ను బలవంతంగా ఆపడం వల్ల అది తిరిగి శరీరంలోకే ప్రవేశించి అజీర్తికి దారితీస్తుంది. కడుపు ఉబ్బినట్లుగా అయ్యి తిన్న ఆహారం సరిగా అరగదు. ఆకలి వేసినా ఏమీ తినాలని అనిపించదు. ఆహారం గుర్తుకొస్తేనే వికారంగా ఉంటుంది. వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఆపానవాయువును బలవంతంగా ఆపకపోవడం ఉత్తమం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram