Health tips | తరచూ ఈ కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఒంట్లో కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది..!
Health tips : ఉరుకులు పరుగుల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్ల కారణంగా ఈ రోజుల్లో చాలామంది ఊబకాయులుగా మారుతున్నారు. ఈ ఊబకాయం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి బరువు తగ్గటం కోసం వాళ్లు ఎన్నో తిప్పలు పడుతుంటారు. బరువు తగ్గాలంటే కచ్చితంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.

Health tips : ఉరుకులు పరుగుల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్ల కారణంగా ఈ రోజుల్లో చాలామంది ఊబకాయులుగా మారుతున్నారు. ఈ ఊబకాయం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి బరువు తగ్గటం కోసం వాళ్లు ఎన్నో తిప్పలు పడుతుంటారు. బరువు తగ్గాలంటే కచ్చితంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. నిత్యం వ్యాయామం అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ముఖ్యంగా బరువును తగ్గించే కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సొరకాయ
ఆనిగకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీనిలో విటమిన్‌లు, ఖనిజాలు, ఫైబర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ప్రతిరోజు రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ సొరకాయ రసం తీసుకుంటే శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. మ
కాకరకాయ
సాధారణంగా చాలామంది చేదుగా ఉంటుందనే కారణంతో కాకరకాయను ఇష్టపడరు. నిజానికి దీనిలో పీచుపదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలం. మధుమేహులు, హృద్రోగులు బరువు తగ్గాలంటే ప్రతిరోజు కాకరకాయను ఆహారంలో తీసుకోవాలి. ఇది కొవ్వును కరిగించటమేగాక రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
టమాట
టమాటలో మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో నీటి శాతం కూడా ఎక్కువే. కేలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. విటమిన్ సి టమాటలో పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
క్యారెట్
బరువు తగ్గాలి అనుకునేవాళ్లకు క్యారట్ కూడా చాలా ప్రయోజనకారిగా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. క్యారెట్‌లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యారట్‌లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్‌ను కలుగజేస్తుంది.