రేపు యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం డిశ్చార్జ్
తన ఫామ్‌హౌజ్‌లో జారీపడి తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నట్లుగా యశోధ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్: తన ఫామ్‌హౌజ్‌లో జారిపడి, తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జ్ కానున్నట్లుగా యశోద హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. డిశ్చార్జ్ తర్వాతా నందిహిల్స్‌లోని తన నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే నందిహిల్స్ నివాసానికి అవసరమైన మరమ్మతులు చేసి, రంగులు వేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటారన్న చర్చ జరుగుతున్నది.
శస్త్రచికిత్స అనంతరం కోటుకుంటున్న కేసీఆర్‌కు మరో 4 నుంచి 8వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కేసీఆర్ గత గురువారం జారీపడగా ఆయనకు శుక్రవారం ఆపరేషన్ చేశారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. వాకర్స్ సహాయంతో నడుస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒక దశలో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా దవాఖాన వద్దకు చేరుకోగా.. కేసీఆర్ ఒక వీడియో సందేశం విడుదల చేసి, తానే త్వరలో కోలుకుని వస్తానని, హాస్పిటల్‌లో ఇతర రోగులకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram