వేస‌వి ఔష‌ధం… మ‌జ్జిగ‌

ఒక్కో ఏడాది గ‌డుస్తున్న కొద్దీ ఎండ‌లు పెరిగిపోతున్నాయి. అందుకే మార్చిలోనే ప‌గ‌టి స‌మ‌యం బ‌య‌టికి వెళ్లాలంటేనే భ‌యం వేసే వాతావ‌ర‌ణ ప‌రిస్థితులున్నాయి.

వేస‌వి ఔష‌ధం… మ‌జ్జిగ‌

ఒక్కో ఏడాది గ‌డుస్తున్న కొద్దీ ఎండ‌లు పెరిగిపోతున్నాయి. అందుకే మార్చిలోనే ప‌గ‌టి స‌మ‌యం బ‌య‌టికి వెళ్లాలంటేనే భ‌యం వేసే వాతావ‌ర‌ణ ప‌రిస్థితులున్నాయి. ఎండ‌ల్లో బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా కూల్ డ్రింకులు తాగ‌డం చాలా మందికి అల‌వాటు. కానీ ఇలాంటి ఏరేటెడ్ డ్రింక్స్ క‌న్నా కొబ్బ‌రి బోండాలు, మ‌జ్జిగ లాంటివే ఎక్కువ మేలు చేస్తాయ‌ని చెబుతూ ఉంటారు వైద్య నిపుణులు. 


మ‌జ్జిగ తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ల్ల‌ద‌న‌మే కాకుండా.. పొట్ట‌లోని మంచి బాక్టీరియా పెరుగుతాయి. అందుకే వేస‌విలో అన్ని ర‌కాలుగా కూడా మ‌జ్జిగ తాగ‌డం ఎక్కువ మేలు చేస్తుంది.

  • మజ్జిగను కాలాలతో సంబంధం లేకుండా తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ మజ్జిగకు కొత్తిమీర, పుదీనా ఆకులు, జీరా పౌడర్, ఉప్పు, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని తాగితే రుచికరంతోపాటుగా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
  • జీర్ణక్రియ మెరుగుప‌డి మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలకు మజ్జిగ బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది మజ్జిగ.
  • స్పైసీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి బయటి ఆహారాలను ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్, అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కానీ ఈ సమస్యలు అంత తొందరగా తగ్గవు. అయితే ఆ సమయంలో ఒక గ్లాస్ మజ్జిగను తాగితే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. అందుకే ఇలాంటి ఆహారాలను తిన్న తర్వాత మజ్జిగను ఖచ్చితంగా తాగటం మంచిది.
  • బిర్యానీతో పాటుగా కోక్ లాంటివి తాగ‌డం చాలామందికి అల‌వాటు. కానీ బిర్యానీ లాంటి ఫుడ్ తీసుకున్న‌ప్పుడు మ‌జ్జిగ తాగ‌డం ఎక్కువ మేలు చేస్తుంది.
  • మజ్జిగలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మజ్జిగలో ఉండే కాల్షియం, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియంలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ గ్లాస్ మజ్జిగను తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అయితే దగ్గు, జలుబుతో బాధపడేవారు చిక్కని మజ్జిగను తాగకూడదు.
  • పిల్లలకు పెరుగు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ల‌కు మజ్జిగను తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇది పిల్లల్లో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
  • మారిన మ‌న జీవ‌న‌శైలి వ‌ల్ల మ‌ధుమేహం, గుండెజ‌బ్బుల‌తో పాటు బీపీ స‌మ‌స్య కూడా పెరుగుతోంది. ఈమ‌ధ్య అయితే చిన్న పిల్ల‌ల్లో కూడా అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇలాంటి వారికి మజ్జిగ ఔషదంలా పనిచేస్తుంద‌ని అనేక అధ్య‌య‌నాల్లో తేలింది. ఇది బీపీని త్వరగా కంట్రోల్ చేస్తుంది.
    • వేసవిలో శరీరంలో వేడిని మజ్జిగ హరిస్తుంది. అందుకని వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి. మజ్జిగలో మిరియాల పొడి, ధనియాల పొడి, ఎండబెట్టిన అల్లం పౌడర్ వేసుకుని అయినా తీసుకోవచ్చు.
  • బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ మంచి ఔషధం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పెరుగుకు బదులు మజ్జిగ వాడుకోవాలి. ఆరోగ్యానికి మంచి చేసే బాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ ఉండడంతో జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.
  • ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడే వారికీ మజ్జిగతో మంచి ఫలితాలు ఉంటాయి.