Bad Cholesterol | స్థూలకాయంతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించి తగ్గించుకోండి..!
Bad Cholesterol | స్థూలకాలం సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. మారుతూ వస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు స్థూలకాయానికి ప్రధాన కారణం. వేసవిలో కంటే శీతాకాలం ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటుంది. ఇందుకు చాలా కారణే ఉన్నాయి. ఎక్కువ జిడ్డు పదార్థాలు తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండకపోవడం తదితర కారణాలు ఉన్నాయి. శరీరంలో పెరుగుతున్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోకపోతే పలు సమస్యల బారినపడే ప్రమాదం ఉంది. హైబీపీ, గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ […]
Bad Cholesterol | స్థూలకాలం సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. మారుతూ వస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు స్థూలకాయానికి ప్రధాన కారణం. వేసవిలో కంటే శీతాకాలం ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటుంది. ఇందుకు చాలా కారణే ఉన్నాయి. ఎక్కువ జిడ్డు పదార్థాలు తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండకపోవడం తదితర కారణాలు ఉన్నాయి. శరీరంలో పెరుగుతున్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోకపోతే పలు సమస్యల బారినపడే ప్రమాదం ఉంది. హైబీపీ, గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో శరీరంలో నుంచి చెడు కొవ్వును తగ్గించే మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే, కొన్ని చిట్కాలను సైతం పాటించి ఈ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం రండి..!
- కప్పు గోరువెచ్చటి నీటిలో కొంచెం తేనెను కలుపుకొని తాగాలి. అవసరమైతే కొన్ని చుక్కల వెనిగర్‌ను కలుపుకోవచ్చు. రెగ్యులర్ తాగుతూ వస్తే మంచి ఫలితం ఉంటుంది.
- నిత్యం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అలాగే బరువును వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
- పసుపు నీటిని తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. పసుపు నీరు ధమనులను శుభ్రం చేస్తుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
- మెంతుల్లో పొటాషియం, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు మెంతి గింజల్లో ఉంటాయి. వీటిని రోజుకు రెండుసార్లు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram