Blood Stains | దుస్తుల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయా..? ఈ చిన్న చిట్కాతో తొల‌గించొచ్చు..!

Blood Stains | మ‌నం ధ‌రించే దుస్తుల‌పై( Clothes ) అప్పుడ‌ప్పుడు మ‌ర‌క‌లు( Stains ) అంటుతాయి. కొన్ని మ‌ర‌క‌లు ఈజీగా పోతాయి. మ‌రికొన్ని మర‌క‌ల‌కు ప్ర‌త్యేక ర‌సాయ‌నాలు( Chemicals ) వాడాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మ‌ర‌క‌లు వ‌ద‌ల‌వు.

  • By: raj    health    Oct 04, 2024 7:27 AM IST
Blood Stains | దుస్తుల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయా..? ఈ చిన్న చిట్కాతో తొల‌గించొచ్చు..!

Blood Stains | మ‌న శ‌రీర ఆకృతికి త‌గ్గ‌ట్టు, మ‌న‌కు న‌చ్చిన దుస్తుల‌ను( Clothes ) ధ‌రిస్తుంటాం. కొన్ని సంద‌ర్భాల్లో అనుకోకుండా బ‌ట్ట‌ల‌పై మ‌ర‌క‌లు( Stains ) ప‌డుతుంటాయి. టీ( Tea ) తాగిన‌ప్పుడో, భోజ‌నం( Lunch ) చేసిన‌ప్పుడో, లేదా ఇత‌ర వ్య‌ర్థాలు బ‌ట్ట‌ల‌పై ప‌డి మ‌ర‌క‌లుగా ఉండిపోతాయి. ఇక ఆ మ‌ర‌క‌ల‌ను తొల‌గించేందుకు ఇల్లాలు ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతుంది. చివ‌ర‌కు ఆ మ‌ర‌క‌ల‌ను తొల‌గిస్తుంది. ఇక గొడ‌వ‌ల‌కు దిగిన‌ప్పుడు లేదా స్త్రీల‌కు నెల‌స‌రి( Periods ) స‌మ‌యంలో బ‌ట్ట‌ల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు( Blood Stains ) ప‌డుతుంటాయి. ఈ ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంత ఈజీగా తొల‌గిపోవు. ఈ మ‌ర‌క‌ను తొల‌గించేందుకు చిన్న చిట్కా ఫాలో అయితే స‌రిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

  • భోజ‌నం చేసే స‌మ‌యంలో వివిధ ఆహార ప‌దార్థాలు పొర‌పాటున దుస్తుల‌పై ప‌డుతుంటాయి. ఈ మ‌ర‌కల‌కు డిట‌ర్జెంట్ సోప్( detergent soap ) స‌రిపోతుంద‌ట‌. చాక్లెట్ మరకలు పడితే బట్టల సోడా కలిపిన నీటిలో మరకను నానబెట్టి.. తర్వాత డిటర్జెంట్​తో ఉతికితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
  • గొడ‌వల్లో లేదా ప్ర‌యాణం చేసేటప్పుడు ప్ర‌మాదాలు జ‌రిగితే.. బ‌ట్ట‌ల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు( Blood Stains ) ప‌డుతుంటాయి. మ‌రి ముఖ్యంగా మహిళలకు నెలస‌రి స‌మ‌యంలో ర‌క్త‌పు మరకలు సాధారణంగానే వారు వేసుకున్న బ‌ట్ట‌ల‌కు అంటుతాయి. ఈ మ‌ర‌క‌ల‌ను తొల‌గించ‌డానికి.. హైడ్రోజన్ పెరాక్సైడ్ బాగా పనిచేస్తుందట. రక్తం మరక మీద హైడ్రోజన్ పెరాక్సైడ్( hydrogen peroxide ) వేసి నానబెట్టిన తర్వాత డిటర్జెంట్ సోప్‌తో ఉతికితే మరకలు పోతాయని నిపుణులు చెబుతున్నారు.
  • ఒకవేళ దుస్తులపై లిప్​ స్టిక్(lipstick ) మరకలు పడితే దానిపై గ్లిజరిన్( glycerin ) రాసి అరగంట తర్వాత ఉతకాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మరక సులభంగా పోతుందట‌. మరకలపై నిమ్మకాయ( Neem ) ముక్కను రుద్దడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుందట‌.
  • మనం వివిధ పనులు చేసే సమయంలో దుస్తులపై ఇనుప తుప్పు మరకలు పడుతుంటాయి. ఇలాంటప్పుడు అర బకెట్ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి ఉప్పు( Salt ) వేసి దుస్తులను నానబెట్టాలట. ఆ తర్వాత మరకలపై నిమ్మరసం వేసి డిటర్జెంట్ సబ్బుతో బాగా ఉతికితే మరకలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా తుప్పు మరకలను తొలగించడానికి బాగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.