Kidneys | ఎండాకాలంలో కిడ్నీలను కాపాడుకునేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Kidneys | ఎండాకాలం( Summer )లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు అధికంగా సంభవించే అవకాశం ఉంది. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీ సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలో రక్త ప్రవాహం( Blood Pressure ), హోమియోస్టాటిక్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంచేందుకు మూత్రపిండాలు సరిగ్గా పని చేయాలి. మరి […]
Kidneys | ఎండాకాలం( Summer )లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు అధికంగా సంభవించే అవకాశం ఉంది. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీ సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలో రక్త ప్రవాహం( Blood Pressure ), హోమియోస్టాటిక్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంచేందుకు మూత్రపిండాలు సరిగ్గా పని చేయాలి. మరి కిడ్నీలను కాపాడుకోవాలంటే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
Dehydration డీ హైడ్రేషన్‌కి దూరంగా ఉండాలి..
ఎండాకాలంలో చాలా మందికి చెమటలు పడుతాయి. దీంతో శరీరం డీ హైడ్రేట్‌కు గురవుతుంది. డీ హైడ్రేషన్ కారణంగా రాళ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇందు కోసం రెగ్యులర్‌గా హైడ్రేటెడ్‌గా ఉండటం మంచిది. దాని కోసం నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్న వారు.. డీ హైడ్రేషన్‌కు దూరంగా ఉంటే మంచిది.
Salt ఉప్పును అధికంగా తీసుకోవద్దు..
ఉప్పు అధికంగా తీసుకోవడం అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రక్తపోటు పెరుగుతుంది. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఉప్పును మితంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలతో పాటు గుండె సమస్యలు, బీపీ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోజుకు 4 నుంచి 5 గ్రాముల ఉప్పు తీసుకుంటే మంచిది.
Fiber Food ఫైబర్ ఫుడ్‌తో కిడ్నీ సమస్యలకు చెక్
ఫైబర్ ఫుడ్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. బీన్స్, బఠానీలు, ఆకుకూరలు, చిక్కుళ్లు వంటి ఫుడ్ తీసుకుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
Pain Killers పెయిన్ కిల్లర్స్‌కు దూరంగా ఉండండి..
కాళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు చాలా మంది పెయిన్ కిల్లర్స్‌ను వాడుతుంటారు. వాటి వల్ల కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్‌ను తగ్గించుకోవడం మంచిది. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే.. డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మెడిసిన్స్ వాడితే ప్రయోజనం ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram