Neck pain | మెడనొప్పి వేధిస్తుందా..? ఓ సారి ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..!
Neck pain | మెడ నొప్పిని సర్వికల్జియా అని కూడా పిలుస్తుంటారు. ఇది ఓ సాధారణ సమస్య. మూడింట రెండువంతుల మంది మెడనొప్పితో బాధపడుతారు. అయితే, ఎప్పుడూ మెడలోనే కేంద్రీకృతమై ఉండదు. శరీరమంతా ప్రసరిస్తూ ఉంటుంది. భుజాలు, చేతులు, ఛాతిపై సైతం ప్రభావం చూపుతుంది. మెడ నొప్పితో కూర్చోవడం కూడా కష్టం మారుతుంది. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి ఉన్న సమయంలో మెడ కండరాలు గట్టిపడుతాయి. దీంతో నొప్పిగా ఉంటుంది. నిద్రలేమితో పాటు పరుపులు, […]
Neck pain | మెడ నొప్పిని సర్వికల్జియా అని కూడా పిలుస్తుంటారు. ఇది ఓ సాధారణ సమస్య. మూడింట రెండువంతుల మంది మెడనొప్పితో బాధపడుతారు. అయితే, ఎప్పుడూ మెడలోనే కేంద్రీకృతమై ఉండదు. శరీరమంతా ప్రసరిస్తూ ఉంటుంది. భుజాలు, చేతులు, ఛాతిపై సైతం ప్రభావం చూపుతుంది. మెడ నొప్పితో కూర్చోవడం కూడా కష్టం మారుతుంది. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి ఉన్న సమయంలో మెడ కండరాలు గట్టిపడుతాయి. దీంతో నొప్పిగా ఉంటుంది. నిద్రలేమితో పాటు పరుపులు, దిండ్లు సైతం మెడ నొప్పి కూడా కారణమవుతాయి. అయితే, కొన్ని హోంరెమిడీస్‌తో సమస్య నుంచి బయటపడవచ్చు.
వేడి నీటితో..
మెడ నొప్పిని సైకై రెసిపీ తగ్గించడంతో పాటు వేగంగా ప్రభావాన్ని చూపుతుంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న సమయంలో సంచిలో వేడి నీటిని పోసి మర్దనాలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేడినీటితో కాపడం వల్ల నరాలు, కండరాలు ఉపశమనం పొందుతాయి. దాంతో నొప్పి తగ్గుతూ వస్తుంది.
ఆవాల నూనెతో మసాజ్
నూనెతో మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేయడం మెడ నొప్పికి చెక్‌పెట్టొచ్చు. అలాగే లావెండర్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల కూడా నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
యోగాతో ప్రయోజనం..
మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా సైతం ఉపయోగకరంగా ఉంటుంది. పలు రకాల యోగాతో తక్షణ ఉపశమనం ఉంటుంది. యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ధృడత్వాన్ని తొలగించడం ద్వారా నొప్పి తగ్గుతుంది. అయితే, యోగా చేసే సమయంలో మెడను ఎట్టి పరిస్థితిల్లో బలవంతంగా వంచొద్దు. అలా చేస్తే నొప్పి మరింత తీవ్రమవుతుంది.
అల్లం-తేనెతో..
అల్లం, తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి నొప్పిని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. అల్లం-తేనె కలిపి ఉపయోగించడం వల్ల మెడ నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
రాక్‌సాల్ట్‌తో..
రాక్ సాల్ట్‌ను నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో రాక్ సాల్ట్ కలిపి పుక్కిలించాలి. ఇలా చేస్తే కండరాలకు ఉపశమనం పొందుతాయి. తద్వరా నొప్పి తగ్గుతూ వస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram