చీరకట్టులో జిమ్.. అందరి దృష్టిని ఆకర్షించిన 56 ఏండ్ల మహిళ.. వీడియో
Woman Gym | శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటాం. అందుకోసం ప్రతి ఒక్కరూ ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. ఓ మహిళ కూడా తన ఫిట్‌నెస్ కోసం జిమ్ చేయడం మొదలు పెట్టింది. అది కూడా చీర ధరించి జిమ్ చేయడంతో.. అందరి దృష్టిని ఆకర్షించింది. 56 ఏండ్ల వయసులోనూ పవర్ లిఫ్టింగ్ చేయడం, పుషప్స్ తీయడం వంటివి చూస్తే […]

Woman Gym | శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటాం. అందుకోసం ప్రతి ఒక్కరూ ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. ఓ మహిళ కూడా తన ఫిట్‌నెస్ కోసం జిమ్ చేయడం మొదలు పెట్టింది. అది కూడా చీర ధరించి జిమ్ చేయడంతో.. అందరి దృష్టిని ఆకర్షించింది. 56 ఏండ్ల వయసులోనూ పవర్ లిఫ్టింగ్ చేయడం, పుషప్స్ తీయడం వంటివి చూస్తే మనం ఆశ్చర్యకపోక తప్పదు.
చెన్నైకి చెందిన 56 ఏండ్ల మహిళ తన కుమారుడి జిమ్ సెంటర్‌లో ప్రతి రోజు వ్యాయామం చేస్తుంది. తన కోడలితో కలిసి జిమ్‌కు వెళ్తుంది. చీర ధరించే ఎక్సర్‌సైజులు చేస్తుంటుంది. ప్రతి రోజూ పవర్ లిఫ్టింగ్ ఎత్తడం, పుషప్స్ తీయడం, బరువులు ఎత్తడం వంటి ఎక్సర్‌సైజులు చేస్తుంటుంది ఆవిడ. ఆ జిమ్ సెంటర్‌లో ఆమె బెస్ట్ ఫార్మార్‌గా కూడా నిలిచింది.
View this post on Instagram
ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. నాకు 52 ఏండ్ల వయసు ఉన్నప్పుడు మోకాలి, కాళ్ల నొప్పులతో బాధపడేదాన్ని. నా కుమారుడి సలహా మేరకు జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాను. ప్రతి రోజు వ్యాయామం చేయడంతో నొప్పుల నుంచి ఉపశమనం పొందాను. నా కోడలితో కలిసి ప్రతి రోజు జిమ్‌కు వస్తానని, ఇప్పుడు నా శరీరం ఫిట్‌గా ఉందని తెలిపింది.
అయితే ఈ మహిళకు సంబంధించిన జిమ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 1.1 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించగా, 72 వేల మంది లైక్ చేశారు. ఆమె జీవితం చాలా మందికి ప్రేరణగా నిలుస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆమె వర్కవుట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.