ఆ ఒక్క ప‌రీక్ష‌తో 18 రకాల క్యాన్సర్లను గుర్తించొచ్చు?

కాస్త ముందుగా గుర్తించి ఉంటే ప్రాణాలు కాపాడేవాళ్లం.. కేన్స‌ర్ (Cancer Early Detection) బాధితుల‌ను ప‌రీక్షించిన‌ప్పుడు డాక్టర్లు చెప్పే మాట ఇది.

ఆ ఒక్క ప‌రీక్ష‌తో 18 రకాల క్యాన్సర్లను గుర్తించొచ్చు?

విధాత: కాస్త ముందుగా గుర్తించి ఉంటే ప్రాణాలు కాపాడేవాళ్లం.. కేన్స‌ర్ (Cancer Early Detection) బాధితుల‌ను ప‌రీక్షించిన‌ప్పుడు డాక్టర్లు చెప్పే మాట ఇది. కేన్స‌ర్ ప‌రీక్ష‌ల‌పై అంద‌రికీ అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, ఖ‌ర్చుకు భ‌య‌ప‌డ‌టం.. అలానే ప్ర‌తి వివిధ కేన్స‌ర్‌ల‌కు ప‌లు ర‌కాల ప‌రీక్ష‌లు చేయించాల్సి రావ‌డం వంటి కార‌ణాల చేత‌.. చాలా మంది కేన్స‌ర్ చెక‌ప్‌ల‌కు వెన‌కాడ‌తారు. దీనికి ప‌రిష్కారంగా ఒకే ఒక డీఎన్ఏ ప‌రీక్ష‌తో 18 ర‌కాల కేన్స‌ర్ల‌ను చాలా తొలి ద‌శ‌లోనే గుర్తించే విధంగా శాస్త్రవేత్త‌లు చేసిన ప‌రిశోధ‌న (Study) స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది.


అమెరికా (America) బ‌యోటెక్ సంస్థ నోవెల్నా ఈ ప‌రీక్ష‌ను రూపొందించింది. రక్తంలోని ప్ర‌ధాన భాగ‌మైన ప్లాస్మాలో ఉండే ప్రొటీన్ల‌ను విశ్లేషించ‌డం ద్వారా వివిధ ర‌కాల కేన్స‌ర్‌ల‌ను చాలా ముందుగానే అత్యంత క‌చ్చిత‌త్వంతో నిర్దారించొచ్చ‌ని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన బీఎంజే ఆంకాల‌జీ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఒక వేళ ఈ విధానానికి ప్ర‌పంచ్యాప్త గుర్తింపు ల‌భిస్తే.. కేవ‌లం ర‌క్త ప‌రీక్ష‌ల ద్వారానే కేన్స‌ర్‌ను గుర్తించేందుకు వీల‌వుతుంది. ప్ర‌స్తుతం మ‌నిషి చావుల‌కు కార‌ణంగా నిలిచే ఆరోగ్య స‌మ‌స్య‌ల్లో కేన్స‌ర్ ఆరో స్థానంలో ఉంది.


అందులోనూ మ‌ధ్య‌, దిగువ ఆదాయ దేశాల్లోనే ఈ మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. కాబ‌ట్టి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఈ ప‌రీక్ష సంజీవినిలా మారే అవ‌కాశ‌ముంది. ఈ ప‌రిశోధ‌న నిమిత్తం శాస్త్రవేత్త‌లు 18 ర‌కాల కేన్స‌ర్‌లు ఉన్న 440 మంది నుంచి ర‌క్తాన్ని సేక‌రించి.. వారి ప్లాస్మాను విశ్లేషించారు. దీంతో పాటు 44 మంది ఆరోగ్య‌వంతుల నుంచీ ర‌క్తాన్ని సేక‌రించి ప‌రిశీలించారు. 440 మంది ప్లాస్మాలోని ప్రొటీన్‌ల‌ను చూడ‌గా.. అవి కేన్స‌ర్ తొలి ద‌శ నుంచే అసాధార‌ణ మార్పును ప్ర‌దర్శిస్తున్నాయ‌ని గుర్తించారు.


అయితే ఈ విధానంపై భారీ న‌మూనాల‌ను తీసుకుని ప‌రిశోధ‌న చేయాల్సి ఉంద‌ని వోల్ఫ్స‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో వైద్యుడు డా.మంగేశ్ థోర‌ట్ అభిప్రాయ‌ప‌డ్డారు. అందులోనూ స‌త్ఫ‌లితాల‌ను ఇస్తే.. ఒక స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్‌ను అభివృద్ధి చేసి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంద‌న్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే కేన్స‌ర్ నిర్ధార‌ణ‌లో డీఎన్ఏ ప‌రీక్ష ఒక గేమ్ ఛేంజ‌ర్ అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.