Diabetes | మారుతూ వస్తున్న లైఫ్‌స్టయిల్ కారణంగా చాలా మంది డయాబెటిస్ బారినపడుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది షుగర్‌వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహంతో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు. ఆహారంలో సరైన వాటిని చేర్చుకుంటే మధుమేహాన్ని కొద్దిరోజుల్లోనే అదుపులో ఉంచుకోవచ్చని పేర్కొంటున్నారు. పలు పండ్లలో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏం పండ్లు తినాలి..? ఏవి తినకూడదు […]
Diabetes | మారుతూ వస్తున్న లైఫ్‌స్టయిల్ కారణంగా చాలా మంది డయాబెటిస్ బారినపడుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది షుగర్‌వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహంతో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు. ఆహారంలో సరైన వాటిని చేర్చుకుంటే మధుమేహాన్ని కొద్దిరోజుల్లోనే అదుపులో ఉంచుకోవచ్చని పేర్కొంటున్నారు. పలు పండ్లలో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏం పండ్లు తినాలి..? ఏవి తినకూడదు అనే విషయంలో చాలా మందికి అయోమయ పరిస్థితి ఉంటుంది. షుగర్‌ను నియంత్రించేందుకు ఏ పండ్లు ఉపయోగపడుతాయో తెలుసుకుందాం రండి..!
ఒక చిన్న చెర్రీ పండుకు మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉన్నది. చెర్రీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 20 ఉంటుంది. ఇది చాలా తక్కువ. చెర్రీస్ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరెంజ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దాంతో అది షుగర్ లెవెన్స్‌ను పెరగనివ్వదు. ఆరెంజ్ పండ్లలో ఫైబర్, విటమిన్ సీ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ నారింజ పండ్లు నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పియర్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ మంచి మొత్తంలో ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు అనేక వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు పియర్ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
డయాబెటిస్తో బాధపడుతున్నవారు బెర్రీలు తినడం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ కూడా షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ సీ పుష్కలంగా ఉన్న చెర్రీస్ మధుమేహానికి మేలు చేస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆపిల్ ప్రయోజనకరంగా పని చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది షుగర్ పెరగకుండా చేస్తుంది. ఐరన్, ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్ తినడంతో మధుమేహం అదుపులో ఉంటుంది.