Sun Stroke | మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందండి ఇలా..
Sun Stroke | ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు వృద్ధులు, పిల్లలు విలవిలలాడిపోతున్నారు. ఈ ఎండల ధాటికి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. నీడన ఉండేందుకు ప్రయత్నించాలి. ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ఓఆర్ఎస్( ORS ) లాంటి ద్రవాలు తీసుకోవడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్( Dehydration ) నుంచి కాపాడుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మజ్జిగ( butter milk ), కొబ్బరి నీళ్లు( Coconut ), సబ్జా నీళ్లు తరుచుగా […]
Sun Stroke | ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు వృద్ధులు, పిల్లలు విలవిలలాడిపోతున్నారు. ఈ ఎండల ధాటికి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. నీడన ఉండేందుకు ప్రయత్నించాలి. ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ఓఆర్ఎస్( ORS ) లాంటి ద్రవాలు తీసుకోవడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్( Dehydration ) నుంచి కాపాడుకోవచ్చు.
- సాధ్యమైనంత వరకు మజ్జిగ( butter milk ), కొబ్బరి నీళ్లు( Coconut ), సబ్జా నీళ్లు తరుచుగా తీసుకోవాలి. వాటర్ మెలన్( Water Melon ), మస్క్ మెలన్( Muskmelon ), ఆరెంజ్( Orange ), బత్తాయి పండ్ల రసాలను తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్‌కు దూరంగా ఉంచొచ్చు.
- శీతల పానీయాలు( Soft Drinks ) తీసుకోకూడదు. వీటి వల్ల దప్పిక ఎక్కువ అవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని కూడా తాగకూడదు. మట్టి కుండల్లో ఉన్న నీటిని తాగాలి. ఇక జ్యూస్‌లను కూడా ఫ్రిజ్‌ల్లో నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు రెడీ చేసుకుని తాగితే మంచిది.
- ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే.. కాటన్ దుస్తులు ధరించాలి. తేలిక దుస్తులు ధరిస్తే చాలా మంచిది. గొడుగు, సన్ గ్లాసెస్‌తో పాటు టోపీ, రుమాలు వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు. వ్యవసాయ పనులు చేసే వారైతే.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు చెట్ల కింద సేద తీరితే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందొచ్చు.
- ఇక ఎండాకాలంలో ఘన పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. ద్రవ పదార్థాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక మోతాదులో తిని ఇబ్బంది పడే కంటే.. తక్కువ మోతాదులో అది కూడా తేలికైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
- బీర కాయ, సొరకాయ, పొట్ల కాయ, దోసకాయ లాంటి నీరు ఉండే కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు తాజాగా వండుకోని తినాలి. ఇక కూరల్లో ఉప్పు, కారం, మసాలాలు తక్కువగా వినియోగించాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram