ఈ ఏడు స‌మ‌యాల్లో త‌ప్ప‌కుండా నీటిని తాగాల్సిందే..? లేదంటే ఆరోగ్యానికి ముప్పే..!

నీళ్లు తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌న‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి వ్య‌క్తి రోజుకు 4 నుంచి 5 లీట‌ర్ల నీటిని తాగాలి. అయితే ప్ర‌తి రోజు ఈ ఏడు స‌మ‌యాల్లో త‌ప్ప‌నిస‌రిగా నీటిని తాగాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకున్న‌ట్టే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

  • By: raj    health    Apr 05, 2024 8:54 AM IST
ఈ ఏడు స‌మ‌యాల్లో త‌ప్ప‌కుండా నీటిని తాగాల్సిందే..? లేదంటే ఆరోగ్యానికి ముప్పే..!

నీళ్లు తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌న‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి వ్య‌క్తి రోజుకు 4 నుంచి 5 లీట‌ర్ల నీటిని తాగాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇక శ‌రీరంలోని మ‌లినాలు కూడా బ‌య‌ట‌కు విసర్జిత‌మ‌వుతాయి. శ‌రీరం కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. అయితే ప్ర‌తి రోజు ఈ ఏడు స‌మ‌యాల్లో త‌ప్ప‌నిస‌రిగా నీటిని తాగాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకున్న‌ట్టే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తెల్ల‌వారుజామున నిద్ర మేల్కొన్న త‌ర్వాత‌..

తెల్ల‌వారుజామున నిద్ర లేచిన త‌ర్వాత త‌ప్పనిస‌రిగా ఒక‌ట్రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి. దీంతో శ‌రీరంలోని అవ‌య‌వాలు చురుగ్గా ప‌ని చేస్తాయి. జీవ‌క్రియ‌ను కూడా ప్రారంభిస్తుంది. గంట‌ల త‌ర్వాత నిద్ర లేస్తాం కాబ‌ట్టి.. నీరు తాగ‌డంతో శ‌రీరం కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. టాక్సిన్ల తొల‌గింపున‌కు కూడా స‌హాయ‌ప‌డుతుంది.
వ్యాయామం త‌ర్వాత‌..

చాలా మంది పొద్దున్నే వ్యాయామం చేస్తారు. ఈ సంద‌ర్భంలో శ‌రీరంలో చెమ‌ట వ‌చ్చి నీటిని కోల్పోతాం. కాబ‌ట్టి వ్యాయామం ముగిసిన వెంట‌నే నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కోల్పోయిన ద్ర‌వాల‌ను తిరిగి ఉత్ప‌త్తి చేసుకున్న‌ట్లు అవుతుంది. హైడ్రేషన్ స్థాయిలను పునరుద్ధరిస్తుంది. అంతేకాకుండా మీ హృదయ స్పందన రేటును సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఇది కండరాల పునరుద్ధరణలో సహాయపడడంతో పాటు నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.

భోజనానికి 30 నిమిషాల ముందు..

మ‌ధ్యాహ్నం, రాత్రి వేళ భోజ‌నానికి అర గంట ముందు త‌ప్ప‌కుండా నీళ్లు తాగాలి. దీంతో డైజెస్టివ్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇక తీసుకున్న ఆహారం కూడా సులువుగా జీర్ణం అవుతుంది. అతిగా తిన‌డాన్ని కూడా నిరోధిస్తుంది.

స్నానానికి ముందు..

స్నానం చేసే ముందు నీళ్లు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇది మీ రక్తాన్ని తాత్కాలికంగా పలుచన చేసి, మీ గుండెను పంప్ చేయడాన్ని సులభతరం అవుతుంది. అయితే, మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. క‌చ్చితంగా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సిందే.

పడుకునే ముందు..

నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు నీరు తాగ‌డం అప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న ఆహార ప‌దార్థాలు సుల‌భంగా జీర్ణం అవుతాయి. ఇక శ‌రీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు స‌హాయ‌ప‌డుతుంది. త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా నివారించి, హాయిగా నిద్ర పోయేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

అల‌సిపోయిన‌ట్లు అనిపించిన‌ప్పుడు..

శ‌రీరంలో అల‌స‌ట వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా నీళ్లు తాగాలి. శ‌రీరాన్ని హైడ్రేట్ చేయ‌డ‌మే కాకుండా.. రిఫ్రెష్ అయ్యేందుకు కూడా సహాయపడుతుంది. తిరిగి శ‌క్తిని పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు..

నీరసంగా ఉన్న‌ప్పుడు, అనారోగ్యానికి గురైన‌ప్పుడు శ‌రీరం డీహైడ్రేట్‌కు గుర‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌తను అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఇక ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కూడా సుల‌భ‌త‌రం అవుతుంది.