Mayonnaise | మయోనిస్ అంత ప్రమాదకరమా..? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది..?
Mayonnaise | ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మయోనిస్. హైదరాబాద్‌లో మోమోస్ తిని మృతి చెందింది. ఈ క్రమలో మయోనిస్ వాడకం ప్రమాదకరంగా భావించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.

Mayonnaise | ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మయోనిస్. హైదరాబాద్‌లో మోమోస్ తిని మృతి చెందింది. ఈ క్రమలో మయోనిస్ వాడకం ప్రమాదకరంగా భావించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, మయోనైస్‌ని ఎలా చేస్తారు ? దాంతో ఏం ప్రమాదం ఉంటుంది? అనే విషయాలపై చాలామంది ఆరా తీస్తున్నారు. వాస్తవానికి మయోనిస్‌ను మయో అని సైతం పిలుస్తుంటారు. గుడ్డులోని పచ్చసొనను నూనెతో కలిపి ఎమల్సిఫై చేసి చేసిన ఓ క్రీమ్ సాస్‌ని మయోనిస్. అయితే, పలుసార్లు వెనిగర్ లేదంటే నిమ్మరసంతో కలిపి తయారు చేస్తుంటారు.
సాండ్‌విచ్‌లు, సలాడ్స్, పలు రకాల ఆహార పదార్థాల్లో వినియోగిస్తుంటారు. ఎక్కువగా మాంసహారం తినే సమయంలో తీసుకుంటారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ మోమోస్ తిన్నది. ఆ తర్వాత వాంతులు, డయేరియా, కడుపులో నొప్పి తదితర లక్షణాలు కనిపించాయి. హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఈ ఘటననను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక చర్యలు చేపట్టింది. పోలీసుల ఆధ్వర్యంలో వైద్య అధికారులు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వద్ద ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్ ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. ఆ తర్వాత మయోనిస్ వినియోగంపై నిషేధం విధించంది.
మయోనిస్ నిల్వ చేయడం, అమ్మడం, తయారు చేయడంపై నిషేధం విధిస్తూ అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మయోనిస్ తయారీలో ఎగ్స్‌ని వినియోగించడం వల్లే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందని గుర్తించారు. ఇలా తయారు చేసిన మయోనిస్‌తో ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లుగా పది కేసులు నమోదయ్యాయి. మోమోస్, షవర్మతో కలిపి తీసుకునే మయోనిస్‌లో నాణ్యత లేదని గుర్తించిన అధికారులు ఏడాది పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేరళ ప్రభుత్వం సైతం మయోనిస్‌ను బ్యాన్ చేసింది.