కొత్త ఇళ్ల కొనుగోళ్లకు హైదరాబాదీల విముఖత.. కారణాలివే
గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 4 శాతం మేర అమ్మకాలు తగ్గిపోయాయి. గతేడాది మొదటి త్రైమాసికంలో 88,361 యూనిట్లు విక్రయించగా, ఈ త్రైమాసికంలో 84,827 యూనిట్లు విక్రయించారు. ప్రపంచ వ్యాప్తంగా తలెత్తున్న ఉద్రిక్తలు, పశ్చిమాసియాలో యుద్దం వంటి కారణాలతో కొనుగోళ్లు తగ్గాయి.
విధాత, హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో గతేడాదితో పోల్చితే 2026 మొదటి త్రైమాసికంలో రెసిడెన్షియల్ ఇళ్ల విక్రయాల్లో కేవలం ఒక శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. ప్రతి సంవత్సరం రెసిడెన్షియల్ ఇళ్ల ధరల్లో 9 శాతం పెరుగుదల కన్పిస్తుండగా, ప్రతి చదరపు అడుగు సగటున రూ.8,211 కు చేరుకున్నది. మొదటి త్రైమాసికంలో 9,975 యూనిట్లు విక్రయించారు. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం అత్యధిక ధరలు కలిగిన విల్లాలు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల విక్రయాలు మందగించాయి. కొనుగోలుదారులకు సమీపంలో ఉన్న ఫ్లాట్ల కొనుగోళ్లు బాగానే జరుగుతున్నాయి. మధ్య తరహా, ప్రీమియం ఇళ్లకు హైదరాబాద్ నగరంలో డిమాండ్ అధికంగా ఉంది.
మొత్తం విక్రయాల్లో రూ.1 నుంచి రూ.2 కోట్ల మధ్య విలువ కల ఫ్లాట్లు లేదా విల్లాలు 4,061 వరకు అమ్ముడు పోగా, మొత్తం విక్రయాల్లో వాటా 43 శాతంగా నమోదు అయ్యింది. రూ.50 లక్షలు నుంచి రూ.1 కోటి మధ్యనున్న ఫ్లాట్లలో 2,467 వరకు విక్రయించారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ధర పలుకుతున్న ఫ్లాట్లు లేదా విల్లాలు 2,192 వరకు కొనుగోలు అయ్యాయి. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ధర ఉన్న విల్లాలు లేదా ఫ్లాట్లు 415 మాత్రమే అమ్ముడుపోయాయి.
గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 4 శాతం మేర అమ్మకాలు తగ్గిపోయాయి. గతేడాది మొదటి త్రైమాసికంలో 88,361 యూనిట్లు విక్రయించగా, ఈ త్రైమాసికంలో 84,827 యూనిట్లు విక్రయించారు. ప్రపంచ వ్యాప్తంగా తలెత్తున్న ఉద్రిక్తలు, పశ్చిమాసియాలో యుద్దం వంటి కారణాలతో కొనుగోళ్లు తగ్గాయి.
ముంబై నగరంలో 7 శాతం, ఢిల్లీలో 11 శాతం, పూణే 11 శాతం తగ్గుదల ఉండగా, బెంగళూరు లో 5 శాతం, హైదరాబాద్ లో 1 శాతం పెరుగుదల నమోదు కావడం విశేషం. బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాలు మినహా మిగతా నగరాల్లో కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించలేదు. గతేడాదితో పోల్చితే ఢిల్లీలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం 8 శాతం మేర పడిపోయింది. హైదరాబాద్, కొలకత్తా నగరాల్లో 6 శాతం చొప్పున, పుణెలో 5 శాతం, ముంబై 1 శాతం మేర పడిపోవడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram