Maganti Sunitha : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతపై కేసు
ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆమె కూతురు అక్షరపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా ప్రార్థన స్థలం వద్ద ప్రచారం చేశారన్నది అభియోగం.
విధాత, హైదరాబాద్ : ఎన్నికల కోడ్ ఉల్లంఘన అభియోగాలతో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాగంటి సునీతతో పాటు ఆమె కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం చేశారన్న అభియోగాలతో వారిపై కేసు నమోదు చేశారు.
యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవారం రోజు నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి.ఈ మేరకు మాగంటి సునీతను ఏ1గా, మాగంటి అక్షరను ఏ2గా చేరుస్తూ యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram