హైదరాబాద్ వాసులకు గిగ్ వర్కర్ల సమ్మె షాక్ ఇవ్వనుంది. రేపటినుంచి నిరవధిక సమ్మె దిగుతున్నట్లు గిగ్ వర్కర్స్ యూనియన్లు ప్రకటించాయి. రేపు రాపిడో, ఓలా, ఉబర్ క్యాబ్ లు, ఆటోల సేవల బంద్ తో పాటు స్విగ్గీ, జొమాటో సేవలు కూడా నిలిపేస్తున్నట్లు తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం(TADF) ప్రకటించింది. గతంలోనే ప్రభుత్వానికి తమ సమస్యలను పరిష్కరించాలని, కనీస చార్జీల పెంపుతో పాటు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని గిగ్ వర్కర్స్ యూనియన్ అల్టిమేట్ ఇచ్చింది.
ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో రేపటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని గిగ్ వర్కర్స్ యూనియన్ నిర్ణయించింది. 4లక్షల మంది కార్మికులతో సమ్మెకు దిగనుండటంతో హైదరబాద్ నగర్ వాసులు యాప్ బేస్డ్, మొబైల్ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది.
