నగరంలోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో ఓ న్యాయవాదిపై హత్యాయత్నం కలకలం రేపింది. దుండగులు పథకం మేరకు న్యాయవాదిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. శనివారం ఉదయం న్యాయవాది మొహినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో బయల్దేరుతున్న క్రమంలో.. వెనుక నుంచి వచ్చి మరో కారుతో దుండగులు ఢీకొట్టారు. దీంతో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు మొయినొద్దీన్ చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. మొయినుద్దీన్ కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.
What exactly is happening in Hyderabad? Daylight attacks, murder attempts, and rising fear on the streets.
What do such shocking incidents indicate about law and order?
A horrifying incident in Hyderabad’s Masab Tank — unidentified assailants allegedly rammed a car into Advocate… pic.twitter.com/VpXSv1KuRF— DONTHU RAMESH (@DonthuRamesh) May 23, 2026
ఇవి కూడా చదవండి :
ధాన్యం కుప్ప వద్ద మరో రైతు హఠాన్మరణం
యాదగిరిగుట్టలో అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
