MLA Adinarayana Reddy : డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కొడుకు అరెస్టు
డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి తెలంగాణ ఈగల్ టీమ్ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడంతో డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
విధాత, హైదరాబాబాద్: డ్రగ్స్ కేసులో ఓ ఎమ్మెల్యే కొడుకు తెలంగాణ ఈగల్ టీమ్ పోలీసులకు చిక్కాడు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది.హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఇంట్లో అతడిని ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది.
ఇంట్లో ముగ్గురు ఉండగా..సుధీర్ రెడ్డితో పాటు మరొకరికి గంజాయి పాజిటీవ్ వచ్చింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో డిప్రెషన్ లో ఉన్న సుధీర్ రెడ్డి గంజాయికి అలవాటు పడ్డాడని..అతడిని డీ అడిక్షన్ సెంటర్ కు పంపించామని ఈగల్ టీమ్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Kavitha : ఎస్పారెస్పీ రెండో దశలో రెండు రిజర్వాయర్లు నిర్మించాలి
Ayodhya Ram : బాలరాముడి దివ్య సుందర రూపం..చూడతరమా!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram