KLR | భాగ్యనగరం భవిష్యత్తు ఫ్యూచర్ సిటీనే : కేఎల్ఆర్
గ్లోబల్ సమ్మిట్‌తో మహేశ్వరం ముఖచిత్రం మారబోతుందని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రముఖ విద్య, ఆరోగ్య సహా ఇతర సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారని కేఎల్ఆర్ గుర్తు చేశారు.
విధాత, హైదరాబాద్:
గ్లోబల్ సమ్మిట్‌తో మహేశ్వరం ముఖచిత్రం మారబోతుందని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రముఖ విద్య, ఆరోగ్య సహా ఇతర సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారని కేఎల్ఆర్ గుర్తు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు భారత్ ఫ్యూచర్ సిటీలో పరిపాలన భవన్ నిర్మాణం సహా గ్లోబల్ సమ్మిట్ కోసం ఎంపిక చేసే స్థలాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… భవిష్యత్ భాగ్యనగరం ఫ్యూచర్ సిటీనే కాబోతుందని మరోమారు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారీ సదస్సు నిర్వాహణకు హైదరాబాద్ నగరంలో 4 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీ, ఇతర భవనాల పనులకు సంబంధించి మ్యాప్ లను కేఎల్ఆర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram