విధాత, హైదరాబాద్ : ఏపీలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత…ఇప్పుడు తెలంగాణకు పాకింది. హైదరాబాద్ నగరంలోని చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఇక స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ వరకు ఆటోలు, వాహనదారులు బారులు తీరుతున్నారు. నిన్న తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కార్యాలయం నుంచి.. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు…బారులు తీరుతున్న వాహనదారుల దృశ్యాలు పెరిగిపోతున్నాయి. కొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే ఉందని, డీజిల్ లేదని నిర్వాహకులు చెప్తున్నారు.
అక్కడ ఎన్నికల తర్వతా ధరలు..కొరత సమస్యలు అధికం ?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఇప్పటికే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికల పోలింగ్ ముగిసిపోగా…పశ్చిమ బెంగాల్ మొదటి దశ పోలింగ్ ముగిసింది. మిగిలిపోయిన బెంగాల్ రెండో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 29న జరుగనుంది. ఈ పోలింగ్ ముగిశాక దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత సమస్యలు, ధరల పెంపు తప్పకపోవచ్చన్న ఆందోళన ప్రజల్లో వ్యాప్తి చెందుతుది. దీంతో బంకుల వద్ద రద్దీ పెరిగిపోతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఓ వైపు ఇరాన్ తో అమెరికా యుద్దం విరమణ చేయకపోవడం..ఇంకోవైపు భారత్ లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత, ధరల పెంపు సమస్యలు ఎదురుకావచ్చన్న భయం ప్రజలను పీడిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చి అపోహాలను, అనుమానాలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
తెలంగాణలో ఓట్లు తొలగింపుకు బీజేపీ కుట్ర: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
సైకిల్ ట్రాక్ పై మహిళకు వేధింపులు..హైదరాబాద్ లో ఘటన
