విధాత: కేబీఆర్ పార్కు పరిసరాలలో చెట్ల నరికివేతపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కేబీఆర్ పార్కు పరిసరాలలో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని 25-35 మీటర్ల ప్రాంతంలో చెట్లను నరకరాదని స్పష్టం చేస్తూ స్టే విధించింది. తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు స్టేతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ (SRDP) పనులు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ ప్రేమికురాలు గచ్చిబౌలి కి చెందిన కాజల్ మహేశ్వరి తరపున ఆయన పిటిషన్ వేశారు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ పై విచారణ చేపట్టింది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను నరకరాదని స్పష్టం చేసింది. పర్యావరణ ప్రేమికుల తరఫున కోర్టులో సీనియర్ కౌన్సిల్ కె. వివేక్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు.
ఇవి కూడా చదవండి :
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో యువకుడి అనుమానాస్పద మృతి
యాసంగి ధాన్యం కొనుగోలులో జాప్యం.. అన్నదాత అరిగోస
