పీవీఆర్ మాల్ నిర్లక్ష్యం..ఉద్యోగి ప్రాణం బలి !

పంజాగుట్ట ఎర్రమంజిల్ పీవీఆర్ మాల్‌లో ఉద్యోగి ఛాతినొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు.

హైదరాబాద్ : పంజాగుట్ట ఎర్రమంజిల్ గెలేరియా పీవీఆర్ మాల్ యజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనకు దారితీసింది. హౌస్ కీపింగ్ సూపర్ వైజర్ గా గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న సత్యనారాయణ చాతిలో నొప్పి వస్తుందని చెప్పి..బాధతో ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని యజమాన్యాన్ని కోరాడు. అయితే యజమాన్యం అందుకు నిరాకరించడంతో పాటు అతడి ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు.

అదే ఛాతి నొప్పితో డ్యూటీ యధావిధిగా నిర్వహించిన సత్యనారాయణ సినిమా ప్రొజెక్టర్ ముందే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచాడు. సత్యనారాయణ మరణించాని తెలుసుకున్న. పీవీఆర్ థియేటర్ యజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా అతడి మృతదేహాన్ని రోడ్డు ఫుట్ పాత్ పై పడవేయించింది. తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే సత్యనారాయణ భార్య అక్కడికి చేరుకుుని ఫుట్ పాత్ పై అనాధ శవంలా పడిఉన్న భర్తని చూసి బోరుమంది. నా భర్తను ఇంత అమానుషంగా రోడ్డుపై పడేస్తారా? అంటూ థియేటర్ యజమాన్యాన్ని నిలదీసింది. నా భర్త చావుకి పీవీఆర్ థియేటర్ యాజమాన్యం కారణమని భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వెంటనే జరిగిన ఘటనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మృతుడి భార్య, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సత్యనారాయణ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తామనడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమంటూ పీవీఆర్ గేలరీ మాల్ లో ధర్నాకు దిగారు. పోలీసులు బందోబస్తు చేపట్టి ఇరువర్గాలతో చర్చిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

దారుణం.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
తెలంగాణ కుల గణన లెక్కలు వెల్లడించిన ప్రభుత్వం

Latest News