Danam Nagendra : ఫిరాయింపు పర్వం… దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది.

Danam Nagendra

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న ఖైరతాబాద్
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణ చేపట్టిన హైకోర్టు దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శిని కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్ .. కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేశారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్ లో హైకోర్టుకు నివేదించారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన రోజు నుంచే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బిహార్‌లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్‌ తీర్పును కొట్టేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు దానంకు నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో మలుపు తీసుకున్నట్లయ్యింది.

ఇవి కూడా చదవండి :

ఆరు నూరైనా ఆయన ఈ రోజు కోర్టులో హాజరుకావాల్సిందే: హైకోర్టు జడ్జీ రాజేశ్వర రావు
ఘనంగా ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల

Latest News