నన్ను గౌరవించే పార్టీకే వెళ్లా: జీవన్ రెడ్డి
నన్ను అగౌరవపరిచే సీఎం రేవంత్ రెడ్డిని వదిలేసి... ప్రజాసేవలో నా సీనియార్టీని, వయసును గౌరవించి.. నన్ను అన్నా అని పిలిచే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లానని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పదవుల కోసం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసమే నేను కాంగ్రెస్ ను వదిలి పెట్టాల్సి వచ్చిందన్నారు.
విధాత, హైదరాబాద్ : నన్ను అగౌరవపరిచే సీఎం రేవంత్ రెడ్డిని వదిలేసి… ప్రజాసేవలో నా సీనియార్టీని, వయసును గౌరవించి.. నన్ను అన్నా అని పిలిచే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లానని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పదవుల కోసం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసమే నేను కాంగ్రెస్ ను వదిలి పెట్టాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చాడని, అధిష్టానం ఆలోచన మేరకు కాకుండా తన కనుసన్నుల్లో పార్టీని నడిపిస్తున్నాడని జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు ప్రజలంటే గౌరవం.. రేవంత్ రెడ్డి మాదిరిగా కాదన్నారు. నేను బీఆర్ఎస్‌లో చేరడం ప్రజల ఆకాంక్ష అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ సూచన మేరకు ప్రభుత్వం నడవాలి కానీ ప్రభుత్వం సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అని ఆరోపించారు.
ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించి, ప్రజాస్వామ్య విధానాలకు విరుద్దమైన నియంత మాదిరిగా వ్యవహరిస్తున్న రేవంత్ పోవాలి…కేసీఆర్ రావాలి అని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలన మార్పు కావాలని ప్రజలు నిర్ణయానికి రావాడానికి పదేళ్లు పడితే రేవంత్ పాలన పోవాలని కోరుకోవడానికి రెండున్నరేళ్లు మాత్రం పట్టడం గమనార్హం అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram