Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..కేసీఆర్ ఓఎస్డీని విచారిస్తున్న సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక ట్విస్ట్ మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ విచారిస్తోంది. వేల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు వేగవంతం.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..కేసీఆర్ ఓఎస్డీని విచారిస్తున్న సిట్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డని ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సారధ్యంలోని ఎస్ఐబీ బృందం ప్రతిపక్ష నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులు, సినీ నటులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే.. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్ఐబీ అధికారులు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరకకుండా కీలకమైన హార్డ్ డిస్క్ లను, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లను ధ్వంసం చేశారు. అనంతరం ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోగా..సిట్ వారిని అతి కష్టం మీద రప్పించి విచారించింది. అయితే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తో అరెస్టు నుంచి రక్షణ పొందుతున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతయ్య, ప్రణీత్ రావుల బృందం వేల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. దొరికిన ఆధారాల మేరరకు 618 ఫోన్‌ నంబర్ల బాధితులను గుర్తించి వారి నుంచి సిట్ వాంగ్మూలాలు సేకరించింది. అటు సుప్రీంకోర్టులోనూ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ రద్దుకు ప్రయత్నించే క్రమంలో అతని ల్యాప్ టాప్ , పెన్ డ్రైవ్ లను ఓపెన్ చేయించేందుకు ఆదేశాలు పొందడంలో సిట్ సఫలీకృతమైంది. తాజాగా కేసీఆర్ ఓఎస్డీ విచారణతో మరో కీలక ముందడుగు వేసింది.