నిరుద్యోగుల మెరుపు ధర్నా.. పోలీస్ ఉద్యోగాలపై కీలక డిమాండ్లు

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగార్థులు మెరుపు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగార్థులు మెరుపు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీస్ నియామక నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 ఏళ్లకు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని, ప్రస్తుతం ప్రకటించిన 7,437 పోస్టులతో కాకుండా మరో 19 వేల పోలీస్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలన్న నిరుద్యోగ జేఏసీ నేత కొడంగల్ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగార్థులు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు మధుసూదన్ గౌడ్, శ్రీకాంత్, వీరేష్, కరుణాకర్, శ్రీకాంత్ రాథోడ్‌తో పాటు పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు.

Latest News